మమ్మల్ని కాస్త పట్టించుకోండి సారూ... ??

GVK Writings
టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో రాధేశ్యామ్ మూవీ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అయిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ కృష్ణంరాజు, బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, షాషా ఛత్రి, సచిన్ ఖేడేకర్, జయరాం తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు.
ఇక సౌత్ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా హిందీ వర్షన్ కి మిథూన్ మన్నన్ సంగీతం కంపోజ్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ లో అలానే ఆడియన్స్ లో విపరీతమైన అంచాలు ఏర్పరిచిన ఈ సినిమా కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన హృద్యమైన ప్రేమ గాథగా ఎంతో భారీ హంగులతో తెరకెక్కిందని, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ దాదాపుగా పదహారు దేశాల్లోని ప్రముఖ స్టూడియోలో జరుగుతోందని సమాచారం. నిజానికి ఎప్పుడో ప్రారంభం అయి ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి కేవలం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, అలానే చిన్న ప్రీ లుక్ టీజర్ మాత్రమే బయటకు వచ్చాయి.
మరోవైపు ఇతర స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలకు సంబంధించి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయని, కానీ తమ రెబల్ స్టార్ నటిస్తున్న రాధేశ్యామ్ నుండి ఇప్పటివరకు సరైన అప్ డేట్ కూడా లేకపోవడం బాధాకరం అంటూ పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు, సర్ కాస్త మమ్మల్ని గుర్తించి మేమున్నాం అని పట్టించుకోండి అంటూ పలువురు ప్రభాస్ ఫ్యాన్స్, యువి క్రియేషన్స్ నిర్మాతలని ఉద్దేశించి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి రాధేశ్యామ్ మేకర్స్ ఇకనైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేదనని పట్టించుకుంటరా లేదో చూడాలని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: