మోహన్ బాబు ఆ సినిమాతో నిర్మాతగా ఎదిగారా..?

Divya
సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎదగడానికి, స్వయంకృషితో పైకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మోహన్ బాబు కూడా ఒకరని చెప్పుకోవచ్చు. ఇక ఈయన కెరియర్లో, మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక ఆ తర్వాత తన సొంత డైలాగులతో, ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఒకవైపు హీరోగా మరొకవైపు ఇంకో విధంగా కూడా నటించి తన సత్తా చాటారు.

ఇక అంతే కాకుండా తన సొంత డబ్బుతో కూడా ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు మోహన్ బాబు. మోహన్ బాబు దాసరి నారాయణ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం కేటుగాడు. ఈ చిత్రం విడుదలైన తర్వాత చాలామంది ఈయనపై నెగిటివ్ కామెంట్లు చేశారట.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకుంది.ఇక ఆ తరువాత ఎన్నో సినిమాలు తీసినా కూడా ఆయన వరుస పరాజయాలను చవి చూశాడు.

ఇక అప్పుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన అల్లుడుగారు సినిమాలో నటించారు మోహన్ బాబు. ఈ సినిమా కూడా ప్లాఫ్  అయ్యిందంటే ఇక మోహన్ బాబు సినీ ఇండస్ట్రీ ని విడిచి వెళ్ళి పోతాడు అని కామెంట్లు ఎక్కువగా వినిపించాయి. ఇక అంతే కాకుండా ఈ సినిమా సక్సెస్ అందుకోవడం తో పాటు నిర్మాతగా కూడా అతని ని నిలబెట్టింది. ఇక అంతే కాకుండా ఈ సినిమాని మలయాళంలో, రీమేక్ చేయగా అందులో శోభన హీరోయిన్ గా, అతిధి పాత్రలో రమ్యకృష్ణ నటించడం జరిగింది.

ఇక ఈ సినిమాకి పాటలు కె.వి.మహదేవన్ ఎంతో అద్భుతంగా పాడడం చేత ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయట.ఇక ఈ చిత్రం లోని ప్రతి ఒక్క సన్నివేశం ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి.ఇక ఈ సినిమాతో నే మోహన్ బాబు గారికి ధైర్యం తో పాటు, విమర్శకుల నుంచి బయట పడేసిందని చెప్పవచ్చు. సాధారణంగా జీవితంలో ఒడిదుడుకులు అనేవి సహజం.. ఇక ఆ ఒడిదుడుకులను తట్టుకొన్నప్పుడే జీవితంలో ఒక మంచి పొజిషన్ కు చేరుకుంటారు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: