టాలీవుడ్ ను కుదిపేస్తున్న స్లంప్ !

Seetha Sailaja

ప్రస్తుతం థియేటర్స్ తెర్చుకున్నప్పటికి సినిమాలు సరిగ్గాలేక ప్రేక్షకులు రావడంలేదా లేక ప్రేక్షకులు రాక సినిమాలు చతికిలపడుతున్నాయా ? అన్నప్రశ్నలకు ఇండస్ట్రీ వర్గాలకు సమాధానాలు దొరకడంలేదు. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఇంకా అక్కడ నైట్ కర్ఫ్యూ కొనసాగుతూ ఉండటంతో కేవలం మూడు షోలు మాత్రమే రన్ అవుతున్నాయి. తెలంగాణలో అన్ని షోలు రన్ అవుతున్నప్పటికీ ప్రస్తుతం విడుదల అవుతున్న చిన్నసినిమాలలో కొన్నిటికి పాజిటివ్ టాక్ వస్తున్నా కలెక్షన్స్ అంతఅంత మాత్రంగానే ఉంటున్నాయి.  

దీనితో ఇప్పటికే రిలీజ్ కు రెడీ అయిన సినిమాలు కొన్నింటిని ఓటిటి కి ఇస్తూ ఉంటే థియేటర్స్ యజమానులు నిర్మాతల పై తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. గతవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘రాజ రాజ చోర’ కలక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈవారం విడుదలైన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ క్లైమాక్స్ అద్భుతంగా ఉంది అంటూ సగటు ప్రేక్షకుడు కామెంట్స్ చేస్తున్నా ఈమూవీకి కూడ చెప్పుకోతగ్గ కలక్షన్స్ రావడంలేదు.

వాస్తవానికి భారీ నిర్మాణ సంస్థల దగ్గర రెడీ అయిన చాలసినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. గీతా కాంపౌండ్ లో మూడు సినిమాలు సితార కాంపౌండ్ లో నాలుగు సినిమాలు రెడీగా ఉన్నా ఆసినిమాలను విడుదలచేయడానికి ధైర్యం చేయడంలేదు. ‘విరాటపర్వం’ ‘దృశ్యం 2’ సినిమాలు ఇప్పటికే ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి. నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రెడీ అయినప్పటికీ ఆమూవీ కూడ ఓటీటీ బాట పడుతుంది అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలను కుదిపేస్తున్నాయి. దీనికితోడు అక్టోబర్ ప్రాంతం నుండి కరోనా థర్డ్ వేవ్ అంటున్నారు.

దీనితో రిలీజ్ కు రెడీ అయిన సినిమాలు దసరా రేస్ కు రాలేక అదేవిధంగా విమర్శలకు భయపడి ఓటీటీ బాట ఎంచుకోలేక తీవ్రంగా సతమతమవుతున్నాయి. వినాయకచావితిని టార్గెట్ చేస్తూ ‘లవ్ స్టోరీ’ వచ్చేనెల 10న విడుదల అవుతుంది అని ఇప్పటివరకు సంకేతాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ మూవీ వాయిదా పడుతుందని ఆడేట్ ను ‘సిటీమార్’ మూవీ తీసుకుంటుందని అంటున్నారు. అంటే ఈనెల 27 నుంచి వచ్చేనెల 10 వరకు ఉన్న సినిమాలే ప్రదర్శింప పడాలి. దీనితో ప్రేక్షకులు లేకుండా ధియేటర్లు ఎలా రన్ చేయాలి అని ధియేటర్ యజమానులు తలపట్టుకుంటూ కనీసం జీతాలు కరెంట్ చార్జీలు కూడ రాకపోతే ఎలా అని మదనపడిపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: