చిరంజీవి అభిమానిగా మీరు ఏమి నేర్చుకున్నారు ?

VAMSI
ఈ రోజు టాలీవుడ్ ను నలభై ఏళ్లుగా ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరుపై ఎన్నో వైద్య శిబిరాలు, రక్త దాన కార్యక్రమాలు, సేవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం చిరంజీవి అభిమాన సంఘాలు ఇలాంటి కారక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు. అయితే సాధారణముగా ఒక హీరోని హీరోగా చూసే ఈ రోజుల్లో చిరంజీవి అభిమానులకు ఆయనపై అంత ప్రేమ కలగడానికి కారణాలు ఏమిటని ఒకసారి చూస్తే, ఆయన నాగురించి టెహ్లిసిన ఏ ఒక్కరైనా ఆయన అభిమానిగా మారాల్సిందే. ప్రతి ఒక్క మనిషిలో కొన్ని పాజిటివ్స్ మరియు నెగేటివ్స్ ఉండడం సహజమే. కానీ చిరంజీవి నుండి ఒక సాధారణ మనిషిగా ఆయన అభిమానిగా మనము ఏమి నేర్చుకోగలము అనేది ఒకసారి చూస్తే.
* చిరంజీవికి అభిమానులంటే ఎనలేని ప్రేమ మరియు గౌరవం. ఈయన ఎన్నో సందర్భాలలో చెప్పారు, అభిమాని లేనిదే ఏ హీరో ఉండడు. నేను ఈ రోజు ఒక మెగాస్టార్ గా ఉన్నానంటే ఈ అభిమానులే కర్త కర్మ క్రియ అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. దీనికి ప్రతి ఒక్క చిరు అభిమాని సంతోషపడాల్సిన విషయం. చిరు లాగే అందరూ ఒకర్నొకరు గౌరవించుకోవాలి. ఈ కాలంలో ఇది చాలా అత్యవసరం.
* ఈ రోజుల్లో ఒక హీరో అంటే ఇలా ఉండాలి అను చెప్పుకునే లక్షణాలు ఈయనతో చాలానే ఉన్నాయి. మనిషిని మనిషిగా గౌరవిస్తాడు. అవసరమైన వాళ్లకు తోడుగా అండగా నిలబడతాడు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ ల ఏర్పాటు మరియు దాని సరఫరా. ఎంతో మంది ప్రాణాలను కాపాడడంలో ఉపయోగపడింది. సేవ చేయాలి అనుకునే గుణం ఆయన ఫ్యామిలిలో ఉంది. సాటివారికి సహాయపడే లక్షణాన్ని అలవరుచుకోండి.
* ఇండస్ట్రీలో వివాదాలకు చాలా దూరంగా ఉండే అతి తక్కువ మందిలో మెగాస్టార్ ఒకరు కావడం విశేషం.  ఎవ్వరు ఈయనను విమర్శించినా, తిట్టినా ఏమీ రెస్పాండ్ కాడు. హాయిగా ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. అందుకే ఈ నాటికిఈ ప్రజల మనసుల్లో చిరంజీవిగా వెలుగుతున్నాడు. ఒకరు మిమ్మల్ని ఏమైనా అంటే..వదిలేయండి వారి పాపాన వారే పోతారు. అంతేకానీ మీరు మళ్ళీ రెస్పాండ్ అయితే గోవ పెద్దదిగా మారుతుంది.
* చాలామందికి తెలియని ఒక విషయం ఏమిటంటే చిరంజీవి చాలా మొహమాటస్తుడు. ఎవరు ఏమి చూపినా కాదనలేడు. వారిని నొప్పించడం ఇష్టం ఉండదు. చాలా సౌమ్యుడు. మీకు తెలిసినంత వరకు ఎవ్వరినీ నొప్పించకండి.
* ఎంటర్ టైన్మెంట్ రంగానికి చెందిన ఏ విభాగంలో అయినా టాలెంట్ ఉంటే వారిని పిలిచి మరీ ఎంకరేజ్ చేస్తాడు. యంగ్ హీరో సత్యదేవ్ ని సైతం బ్లఫ్ మాస్టర్ సినిమా చూసి, అతనికి ఫోన్ చేసి మరీ ఇంటికి పిలిపించుకుని మాట్లాడాడట. అలాగే మన బుల్లితెర జబర్దస్త్ నటుడు ఆదిని కూడా ఇంటికి పిలిచి మాట్లాడాడు.
* మనసులో ఏ విధమైన కల్మషాన్ని పెట్టుకోకుండా స్వచ్ఛముగా ఉంటాడు. అందరితోనూ అలాగే మెలుగుతాడు. అందుకే అందరివాడు సినిమాను తీసారట.
* సినిమాల విషయంలోనూ డైరెక్టర్ లను ఏ సందర్భంలోనూ నొప్పించలేదని తెలుస్తోంది. వారు ఏ విధంగా చెబితే అలా నటించడానికి సిద్ధంగా ఉంటాడట, షూట్ అయిపోయాక డైరెక్టర్ నే అడుగుతాడట. ఎలా చేశాను ? బాగొచ్చిందా ? ఇంకోసారి చెయ్యాలా ? అని ఆయన ప్రవర్తనతో కొత్త డైరెక్టర్ లకు పిచ్చెక్కిపోయేదట.  
ఈ లక్షణాలని మనము ఆయన నుండి నేర్చుకోవచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు ఎంతో ఉంది. అలాంటి మహానుభావుడు ఇంకా ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: