ఈ మేటి తారల ఒంటరితనానికి కారణాలు ఇవే !

Siva.K

పెళ్లి.. ఈ రెండు అక్షరాలు  రెండు హృదయాలతో  పాటు రెండు కుటుంబాలను కలుపుతుంది. కొత్త తరాలకు నాంది పలుకుతుంది.  అందుకే,  సామాజిక శాస్త్రవేత్తలు వివాహాన్ని  స్థిరమైన, శాశ్వతమైన బంధంగా  పరిగణిస్తారు. అందుకే, పెళ్లి  ఒక్కటే   భార్యాభర్తల మధ్య శాశ్వత బంధం.  పెళ్లి ఒక్కటే..    ఇద్దరు వ్యక్తులు ఐక్యమయ్యే స్థితికి నిజమైన ఆధారం.
 
అందుకోసమే  మనిషికి  పెళ్ళి అత్యవసరం అన్నారు మన పూర్వికులు.  కానీ వెండితెర పై  తమ అందచందాలతో ప్రేక్షకులను అందాల కలల ప్రపంచంలో విహరింప చేసిన  కొంతమంది తారలు  45 ఏళ్ళు దాటినా   ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు.  మరి  వాళ్లెవరు ?  వాళ్లెందుకు పెళ్లి  చేసుకోలేదు విందాం.  

1)  నగ్మా :
పరిచయం అవసరం లేని పేరు. ఆమె అందాల కనువిందుల గురించి ఎన్ని ఎపిసోడ్స్ చేసినా సరిపోవు.   నగ్మా  వయసు  45 సంవత్సరాలు.  ఇంకా నగ్మా  పెళ్లి చేసుకోకపోవడానికి కారణం  రెండు సార్లు  ప్రేమలో విఫలమవడమే. దాంతో ఒంటరిగా ఉండటానికే ఆమె ఇష్టపడ్డారు.        
2) టబు :
ఇప్పటికీ బోల్డ్ పాత్రలు చేస్తోన్న బోల్డ్ సీనియర్ హీరోయిన్.  49 ఏళ్ళ వయసొచ్చినా  ఇంకా  పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కారణం మనసుకు నచ్చిన  సరైన పార్ట్నర్ దొరకడం లేదు అంటుంది.  

3) శోభన :
క్లాస్ హీరోయినే కాదు, క్లాసిక్ డ్యాన్సర్ కూడా. 50 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం.. నాట్యం పై ఆమెకున్న అమితమైన అభిరుచే. తన జీవితాన్ని నాట్యానికి త్యాగం చేసిన గొప్ప మనసు ఆమెది    
   
4) సుష్మితా సేన్ :
బోల్డ్ సమాజంలో ఎదురులేని మేటి హీరోయిన్.   45 ఏళ్ళ వయసొచ్చినా  పెళ్లి చేసుకోలేదు. కారణం  రొమన్ షాల్ అనే వ్యక్తితో  సహజీవనమే అంటారు. ఆమె కూడా ఇదే అన్నారు అనుకోండి.  

5) సితార :
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సితారకి ప్రత్యేక గుర్తింపు ఉంది.  ఈమె కూడా 47 ఏళ్ళ వయసొచ్చినా  ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కారణం, తనను సరిగ్గా   గైడ్ చేసేవారు లేకే అంటూ  ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
     
5) అమీషా పటేల్ :
పాన్ ఇండియా హీరోయిన్.  స్టార్ హీరోల సినిమాల్లో  నటించి అలరించింది.   ఈమె వయసు  45 ఏళ్ళు. పెళ్లి చేసుకోవాలనుకున్నా  ఈమెకు కాలం కలిసి రాలేదు.  ఇంకా పెళ్లి ఆలోచనల్లో అమీషా ఉంది.    

6) నర్గీస్ ఫక్రీ :
వయసు 43 ఏళ్ళు.  ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించింది.  ఇంకా పెళ్లి చేసుకోలేదు. కారణం ప్రేమ విఫలం అవడం, సరైన కుటుంబ బంధాలు లేకపోవడం లాంటి కారణాలు వల్ల  ఇంకా ఒంటరిగానే ఉంటున్నారు.    
   
7) వెన్నిరాడై నిర్మల :
 
ఎక్కడో విన్నట్టు ఉంది గానీ,   గుర్తుకురావడం  లేదా.  ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ చిత్రంలో  మెగాస్టార్ కి  తల్లిగా నటించి మెప్పించింది ఈమె.  ఈమె వయసు 74 ఏళ్ళు.  కుటుంబ సమస్యల వల్ల  వయసులో ఉండగా  పెళ్లి చేసుకోలేక పోయారు.  ఆ తర్వాత పెళ్లి ఆలోచన చేసినా..  ఆ పెళ్లి కార్యరూపం దాల్చలేదు. దాంతో ఒంటరిగా ఉండిపోయారు
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: