రాధను సినిమాల్లోకి తీసుకువచ్చింది ఎవరు ?

Mamatha Reddy
తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు తమ తమ నటనతో అందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. వారు స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి తమలోని టాలెంట్ చూపించి ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ రాధా అగ్రహీరోయిన్ గా కొంతకాలం పాటు టాలీవుడ్ సినిమా పరిశ్రమను ఏలారు. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఈమెను నటిగా ఇండస్ట్రీలోకి రాకముందు ఆమె సోదరి అంబికా హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్నారు.

అప్పటికి రాధా చిన్నపిల్ల. ఆమెను కూడా నటిగా చేయాలనే ఉద్దేశంతో ఆమె తల్లి ఆమెకు అన్ని రకాల విద్యలు నేర్పించారు. డాన్స్, నటన నేర్చుకుని రెడీగా ఉంది రాధిక. అంబికా షూటింగ్ కి వెళ్లి వచ్చాక అక్కడ జరిగే ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా వివరించి చెప్పేవారు. అలా క్రమక్రమంగా నటనపై ఆసక్తిని కలిగించారామే. తెలుగులో సీతాకోక చిలుక రీమేక్ అయినా తమిళ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఓ కొత్త నటికోసం అన్వేషిస్తున్న రోజుల్లో ఎడిటర్ ప్రకాష్ ఒకసారి రాధా వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆమె అక్కలు మల్లిక అంబిక లతో  కలిసి రాధ తీయించుకున్న ఫోటో చూసి ఈ ఫోటో భారతీరాజా గారికి చూపిస్తాను. ఈ అమ్మాయి కి ఆయన చిత్రంలో మంచి అవకాశం లభించవచ్చు అని చెప్పారు.

అలాగే ఆ ఫోటో ని చూపించడం ఈ అమ్మాయి బాగుంది ఓకే అని ఆయన చెప్పడం జరిగిపోయింది. రాధా వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమెను చూసి ఆమె తన హీరోయిన్ అని నిర్ణయించుకొని తొందరగా మద్రాస్ రమ్మని చెప్పారు భారతీరాజా. ఆయన చెప్పినట్లుగా ఆమె మద్రాసులో అడుగు పెట్టి ఆ సినిమా లో నటించి ఈ కొత్త అమ్మాయి ఎవరా అనే రేంజ్ లో ఈ సినిమాలో నటించింది రాధా. ఈ సినిమాతోనే ఉత్తమ నటి అవార్డును కూడా ఆమె అందుకుంది. ఆ తర్వాత కాలంలో ఎన్నో చిత్రాల్లో నటించి రాధా కేవలం గ్లామరస్ నటి మాత్రమే కాదు గొప్ప నటి అని కొన్ని సినిమాల్లో చేసిన పాత్రల ద్వారా నిరూపించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: