ఆ సినిమాతో నంది అవార్డు గెలుచుకున్న సునీల్?

murali krishna
సునీల్ టాలీవుడ్ అగ్ర కమెడియన్ లలో ఒకరి గా ఎదిగారు. సునీల్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. ఆయన నువ్వే కావాలి సినిమాతో కమెడియన్ గా పరిచయమయ్యారు. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సునీల్, మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయమే. చిన్నప్పటి నుంచి తనకు హీరో కావాలని ఉండేదట. సునీల్ చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు ఇష్టంగా చూసేవాదట. ఆ సినిమాలతో ఆయనలో కూడా మంచి హీరో కావాలి అనే కోరిక మొదలైందట. రాను రాను సినిమాల ఇష్టంతో తన కాలేజ్ డేస్ లో కొన్ని నాటకాలు కూడా వేసేవాదట. సునీల్ కు హీరోతో పాటు విలన్ గా కూడా నటించాలని ఉండేదట. సినిమాల మీద మక్కువతో తన సొంత ఊరు అయిన భీమవరం వదిలి భాగ్యనగరం వచ్చాడట.అక్కడ సునీల్ కు రూమ్ మేట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పరిచయం అయ్యారట. అతి తక్కువ కాలంలోనే వీరిద్దరూ మంచి స్నేహితులు అయ్యారట.
త్రివిక్రమ్ కు కథా రచయితగా అవకాశం రాగా అందులో మంచి కామెడీ పాత్రలో సునీల్ కు అవకాశం ఇచ్చేవాదట. అప్పటి నుంచి హీరో కావాలని వచ్చిన సునీల్ కమెడియన్ గా మారారు. మాములు కమెడియన్ గా ఉన్న సునీల్ ను స్టార్ కమెడియన్ గా చేసిన చిత్రం దర్శకుడు తేజ తెరకేక్కించిన నువ్వు నేను సినిమా. ఈ  సినిమా అప్పటి సినిమా లవర్స్ కు మంచి కిక్ ఇచ్చింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో ప్రేమ సినిమాల వెల్లువ మొదలైంది. అంతటి భారీ విజయం సాధించింది నువ్వు నేను సినిమా. ఈ అంతటి భారీ విజయం సాధించడానికి సునీల్ కామెడీ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. సునీల్ తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ సినిమాతో మంచి కమెడియన్ గా గుర్తింపు రావడమే కాకుండా బెస్ట్ కమెడియన్ గా ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది. అప్పటి నుండి స్టార్ కమెడియన్ గా సునీల్ ఒక వెలుగు వెలిగారు. కానీ చిన్నప్పటి నుంచి హీరో కావాలనే ఇండస్ట్రీ కి వచ్చిన సునీల్ తన కలను మర్చిపోలేదు. అందాలరాముడు సినిమాతో అందాల తార ఆర్తి అగర్వాల్ తో కలిసి నటించాడు. ఆ సినిమా మంచి విజయం సాధించాడు. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మర్యాదరామన్న సినిమా చేసాడు. ఈ  సినిమాతో హీరో కావాలన్న ఆయన కల తీరినట్లయింది. మర్యాదరామన్న సినిమా భారీ విజయం సాధించింది. ఆ తరువాత చేసిన సినిమాలు కొన్ని ఆడిన మర్యాదరామన్న రేంజ్ హిట్ కాలేదు. దీనితో మళ్ళీ కామెడీ రోల్స్ చేయడం మొదలు పెట్టాడు. అటు హీరోగా చేస్తూనే కమెడియన్ గా అవకాశాలు పొందుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: