ఈ ఏడాది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న స్టార్ కిడ్స్

Mamatha Reddy
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా అన్ని సినిమా పరిశ్రమలో వారసులు అంటే ప్రేక్షకులకు కొత్తేం కాదు. నందమూరి వంశం నుంచి అక్కినేని వంశం వరకు చాలామంది వారసులు ఇప్పుడు  టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్న మహేష్ బాబు అల్లు అర్జున్ రవితేజ  ఎన్టీఆర్ ల వారసులు కూడా సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సోషల్ మీడియా పుణ్యమా అంటూ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి అప్డేట్ క్షణాల్లో ప్రజలందరికీ తెలుస్తుంది. 

వారి పిల్లల విషయం కూడా ఎంతో ఫాస్ట్ గా
అందరికీ తెలిసిపోతుంది. వారు కూడా సోషల్ మీడియాలో ఉండడంతో కూడా ఇప్పటి నుంచే విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతుంది. సెలబ్రెటీల పిల్లలకు లక్షల్లో ఫాలోయింగ్ ఉందంటే వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో చెప్పనవరము లేదు. అయితే దీన్ని కొందరు దర్శక నిర్మాతలు క్యాష్ చేసుకోవాలని వారి పిల్లలను తమ సినిమాలలో నటింపచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ కిడ్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది ఇటీవలే అల్లు అర్జున్ ఆ సినిమా సెట్స్ లో  ఫోటో లు దిగడం సోష ల్ మీడియాలో వైర ల్ కూడా అయ్యాయి. మహేష్ బాబు వారసుడు గౌతమ్ నేనొక్కడినే సినిమాలో సందడి చేయగా ఇప్పుడు మహేష్ కూతురు సితార కూడా సర్కారు వారి పాట చిత్రం ద్వారా ఆరంగెట్రం చేస్తుంది. అలాగే నందమూరి వారసుడు ఎన్టీఆర్ కొడుకు కూడా సినిమాల్లోకి వస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ కూతురు, యష్ కూతురు , కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పిల్లలు కూడా సందడి చేయబోతున్నారు.  చూడబోతే వీరు భవిష్యత్ లో స్టార్స్ అయ్యే విధంగా సినిమాలు చేస్తారు అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: