సీరియల్ హీరోకి భలే ఆఫర్ వచ్చిందిగా ?

VAMSI
ఇండస్ట్రీలోకి బాల నటుడిగా అడుగు పెట్టిన చాలా మంది ఆ తర్వాత పెద్దయ్యాక హీరోగా మారి తమ సత్తా చాటుతున్నారు . వారిలో కొందరు హీరోలుగా సెటిలై వరుస సినిమాలతో దూసుకుపోతుండగా మరి కొందరు ఒకటి రెండు సినిమాలకే వెను తిరుగుతారు. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇదే రీతిలో ఓ హీరోకి అవకాశం వచ్చిందని సినీ ప్రముఖులు అంటున్నారు. 40 సినిమాల్లోకి పైగా తెలుగు చిత్రాల్లో బాలనటుడిగా యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్య చంటిగాడు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు . ఆ తర్వాత కీలుగుఱ్ఱం, జాజిమల్లి, రూమ్మేట్, వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు.
కానీ ఆ తరువాత సినిమా ఇండస్ట్రీలో కనుమరుగయ్యాడు. కానీ కారణం చూస్తే పై చదువులకని కెమెరాకు బ్రేక్ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత 'ఎంత మంచి వాడవురా' అనే చిత్రంలో ఓ ప్రముఖ పాత్రలో నటించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. మళ్లీ అక్కడి నుండి బుల్లితెర వైపుకు తన అడుగులు వేసి ఈటీవీలో 'ఛాంపియన్' అనే గేమ్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాటీవీలో ప్రసారం అవుతున్నటువంటి సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లో హీరోగా చేస్తున్నాడు. అయితే ఓ వైపు ఈ సీరియల్ షూటింగ్ లో బిజీగా ఉన్న బాలాదిత్యకు ఇండస్ట్రీ నుండి పిలుపు వచ్చింది అట. అందులోనూ అది స్టార్ హీరో చిత్రం అని తెలుస్తోంది.
ఆ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలాదిత్యను ఫైనల్ చేసినట్లు సమాచారం. బలమైన పాత్ర కావడంతో పారితోషికం కూడా భారీగానే ఇస్తున్నట్లు వినికిడి. అంతే కాకుండా ఈ సినిమా తనకు మంచి అవకాశంగా మారుతుందని వరుస అవకాశాలు తెచ్చిపెడుతుందని బాలాదిత్య భావిస్తున్నారట. అయితే ఈ అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాలాదిత్యకు ఇక వరుస ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయని ఆశిస్తున్నారు ఆయన అభిమానులు. మరి ఆ ఆఫర్ ఏంటో ఏ సినిమాలోనో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: