సినీ పెద్దలు జోక్యం చేసుకోకపోతే ఇబ్బందే!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు అన్ని సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండడం ప్రేక్షకులను ఆనంద పరుస్తు ఉన్నా సినిమా విశ్లేషకులను మాత్రం ఎంతగానో కలవరపరుస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ఐదు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండటంతో థియేటర్ల సమస్య ఉండబోతుందని వారు అంచనా వేస్తున్నారు. గతంలో పండుగ సమయంలో థియేటర్ల సమస్య రావడంతో నిర్మాతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లడించారు. ఆ విధంగా ఇప్పుడు రాబోయే  పెద్ద సినిమాల నిర్మాతలు ఏవిధంగా థియేటర్ల విషయంలో కాంప్రమైజ్ అవుతారో అన్నది ఆసక్తి కరం గా మారింది.

సంక్రాంతి పండుగకు ముందుగా పవన్ కళ్యాణ్ నటించిన ఏకే రీమేక్ సినిమా థియేటర్ లోకి రానుంది. రానా మరో కథానాయకుడుగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటంతో భారీగా థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా విడుదల అవుతుండగా ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాన్ ఇండియా హీరో అయ్యాక సరైన ఫలితాన్ని అందుకొని ప్రభాస్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. భారీ రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేయాలని కూడా భావిస్తున్నాడు.


ఇక మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమా కి ఉన్న క్రేజ్ సంగతి అందరికీ తెలిసిందే వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు ఈ సినిమాను కూడా ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నాడు. మరోవైపు 2018 సంక్రాంతి కి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న f2 సినిమా సీక్వెల్ f3 కూడా ఈ సంక్రాంతి కి రావాలని చూస్తుంది. వెంకటేష్ వరుణ్ తేజ్ లు నటించిన ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసే విధంగా ఈ సినిమా కూడా సంక్రాంతికి వస్తుండడంతో ఈ భారీ చిత్రాలకు థియేటర్ల సమస్య తప్పకుండా ఎదురవుతుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.

 వరుసగా ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా థియేటర్లలో విడుదల అవుతున్న ఈ సినిమాల విషయంలో సినీ పెద్దలు జోక్యం చేసుకోవాల్సిందిగా అంటున్నారు. ఎందుకంటే సంక్రాంతి వార్ లో అందరూ పెద్ద హీరో లే ఉండడంతో ఎవరికి ఎన్ని థియేటర్లు పంచాలో అన్న విషయమై పెద్ద యుద్ధమే జరుగుతుంది. అలా వారందరికి సినీ పెద్దలు అందరూ కలిసి థియేటర్లను పంచాలని చెబుతున్నారు. గతంలో కూడా సంక్రాంతి సమయంలో పెద్ద హీరోల సినిమాలు రావడం వల్ల వాటి రిలీజ్ లపై పెద్దలు కూర్చుని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ చర్చల ద్వారా మంచి ఫలితాలు రాబట్టుకున్నారు. మరి ఇప్పుడు అలా జరుగుతుందా, ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: