మా మామ గ‌దిలోకి వ‌చ్చి చేతులేశాడు... హ‌నీసింగ్ భార్య.. !

MADDIBOINA AJAY KUMAR
గాయకుడు మరియు రాపర్ యో యో హనీ సింగ్ భార్య షాలినీ తల్వార్ ఇప్ప‌టికే త‌న బ‌ర్త త‌న‌ను వేధింపుల‌కు గురిచేశాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా షాలిని ఇప్పుడు తన మామ గురించి కూడా సంచ‌ల‌న ఆరోప‌నలు చేసింది. గృహ హింస, మానసిక హింస మరియు లైంగిక హింస కు గురి చేశాడ‌ని షాలిని తన భర్త హనీ సింగ్ అలియాస్ హిర్దేశ్ సింగ్‌పై కేసు నమోదు చేసింది. ఇక‌ ఇప్పుడు త‌న మామ‌ సరబ్‌జిత్ సింగ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఒకరోజు తాను గదిలో బట్టలు మార్చుకుంటుండగా, తన మామ తాగి గదిలోకి ప్రవేశించాడని షాలిని పేర్కొంది. అంతే కాకుండా త‌న చాతిని తాకి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని వెల్ల‌డించింది. త‌న‌ను ఇంట్లో ఒక‌ జంతువులా చూసుకున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. 

షాలిని త‌న భ‌ర్త మరియు అత్తామామ‌ల‌తో క‌లిసి నోయిడా లో నివాసం ఉండేది. త‌న‌ను పెళ్లి త‌ర‌వాత హ‌నీసింగ్ చాలా సార్లు కొట్టాడ‌ని, మానసింకంగా శారీర‌కంగా గాయ‌ప‌రిచాడ‌ని తెలిపింది. అంతే కాకుండా పెళ్లి త‌ర‌వాత కూడా హ‌నీసింగ్ చాలా మంది మ‌హిళ‌ల‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడ‌ని షాలిని చెప్పుకొచ్చింది. ఇక త‌న భ‌ర్త చేస్తున్న ప‌నుల‌ను అత్తా మామ‌ల‌కు వివ‌రిస్తే త‌న‌నే కొట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న‌ను అద‌న‌పు క‌ట్నం కోసం కూడా వేధించారని తెలిపింది.  ఇదిలా ఉండ‌గా షాలిని తన భర్తతో  పాటు అత్తమామల‌పై కూడా ఢిల్లీలోని హజారే కోర్టులో ఆగస్టు 3 న పిటిషన్ దాఖలు చేసింది.

తన భర్త హ‌నీ సింగ్ తనను జంతువులా చూసారని... గృహ హింస రక్షణ చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. ఇక ఈ కేసుపై కోర్టు విచార‌ణ‌కు ఆదేశించింది. ఆగస్టు 28 లోపు సమాధానం చెప్పాల‌ని హ‌నీసింగ్ ను కోరింది. కాగా హ‌నీసింగ్ ఒక‌ప్పుడు త‌న పాట‌ల‌తో దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు. ప్రైవేట్ ఆల్బ‌మ్స్ తో పాటుగా సినిమాల్లోనూ పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హ‌నీసింగ్ పాడిన దేశీ క‌లాకార్, యోయో హ‌నీ సింగ్ పాట‌లు చాలా పాపులారిటీని సంపాదించుకున్నాయి. ఈ పాట‌ల‌కు మిలియ‌న్ల కొద్దీ వ్యూవ్స్ వ‌చ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: