స్టార్స్ తో క్లోజ్ గా చేసినా.. అది రావడం లేదే.. ప్చ్..!

NAGARJUNA NAKKA
అవకాశాల కోసం చాలా మంది సినీ దర్శక, నిర్మాతల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్టులు చేస్తుంటారు. వాట్సాప్ లలోనే కాదు.. కాల్స్ చేస్తూ.. డైరెక్ట్ గా ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతుంటారు. అయితే కొందరికి అవకాశాలు వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. కానీ కొందరికి ఎన్ని ఫ్లాపులు వచ్చినా.. అడక్కుండానే అవకాశాలు వస్తుంటాయి. అదీ పెద్దపెద్ద హీరోలతో ఛాన్స్ లు వస్తాయి. కానీ ఏం లాభం. సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతుంటారు. అలాంటి వాళ్లలో వాణీకపూర్ ఒకరు. ఆమ కెరీర్ ఇప్పుడు కష్టాల్లో ఉంది.
వాణీ కపూర్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు ఎనిమిదేళ్లు దాటిపోయింది. ఇన్ని సంవత్సరాల్లో హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్‌ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అంత పెద్ద హీరోలతో  సినిమాలు చేసినా వాణికపూర్ కు స్టార్డమ్ మాత్రం రావడం లేదు. పైగా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌లో వరుస అవకాశాలు అందుకొని సినిమాలు చేస్తోంది. అయినా వాణీ కపూర్‌ గ్రాఫ్ ఏమాత్రం మారడం లేదు.  
బాలీవుడ్‌లో వన్‌ ఆఫ్‌ ది బడా బ్యానర్స్‌గా ఉన్న యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌లో అవకాశం దొరికితే చాలు అని ఎదురుచూసేవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి బ్యానర్‌ వాణీతో ఇప్పటికే నాలుగు సినిమాలు తీసింది. పీరియాడికల్ మూవీ 'షంషేరా'లో కూడా ఆఫర్ ఇచ్చింది. అయితే ఆదిత్య చోప్రా ఈమెని ఎంత ఎంకరేజ్‌ చేస్తున్నా, ఆడియన్స్‌ని మాత్రం ఆకట్టుకోలేక పోయింది.  
వాణీ కపూర్‌ సినీ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. పైగా పెర్ఫామర్‌గానూ ప్రూవ్ చేసుకోలేదు. దీంతో బాలీవుడ్‌ స్టార్స్‌ అంతా వాణీని పక్కనపెట్టేస్తున్నారట. ఈమెని హీరోయిన్‌గా తీసుకోవడం కంటే కొత్త అమ్మాయికి ఆఫర్ ఇవ్వడం బెటర్‌ అని ఫీలవుతున్నారట. దీంతో బాలీవుడ్ వాణీ కపూర్‌ని లైట్ తీసుకుంటోందని, ఈమె కెరీర్‌ క్లైమాక్స్‌కి వచ్చిందనే కామెంట్స్‌ మొదలయ్యాయి. మొత్తానికి వాణీ కపూర్ తన కెరీర్ ను చేతులారా నాశనం చేసుకుంటోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: