సమంత ఫిగర్ కి ఫ్యాన్స్ ఫిదా.. పొట్టి బట్టలతో వర్కౌట్ వైరల్!

Suma Kallamadi
అగ్ర కథానాయిక సమంత తన 34 ఏళ్ళ వయసులో కూడా పడుచుపిల్లలా కనిపిస్తున్నారు. ఆమె నాజూకైన ఫిగర్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. దశాబ్దకాలంగా ఆమె ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి ఎంతగానో అలరించారు. ప్రస్తుతం ఆమె లేడీ ఓరియెంటెడ్, మంచి కథాబలం ఉన్న సినిమాల్లో నటిస్తున్నారు. వెబ్ సిరీస్ లలో కూడా తనదైన శైలిలో నటించే భారత దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. ఇక ఆమెకు సోషల్ మీడియాలో ఏ సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్ కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తనకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంటర్ టైన్ చేయడానికి సమంత అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.తాజాగా కూడా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో వర్కౌట్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో లో ఆమె ఫిగర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక పొట్టి బట్టల్లో ఆమె తన నాజూకైన అందాలను షో చేస్తూ సెగలు పుట్టించారు. తన వెనుక భాగాన్ని బలపరచడానికి ఆమె వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనిపించారు. స్నేహ దాసు అనే ఫిట్ నెస్ ట్రైనర్ సూచనలతో ఆమె వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. ఆమె ఫిట్నెస్ ఇప్పటికీ ఫిట్ గా ఉన్నారంటే.. దానికి కారణం ఇలాంటి కఠినమైన వ్యాయామాలు చేయడమే అని చెప్పుకోవచ్చు. వ్యాయామంతో పాటు ఆమె యోగా కూడా చేస్తుంటారు. అత్యంత పోషక విలువలు ఉన్న డైట్ ఫాలో అవుతుంటారు. అందుకే ఆమె అందమైన శరీరంతో  మెరుస్తుంటారు.


ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో శాకుంతలం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పిరియాడికల్ డ్రామాని నీలిమ గుణ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంత్‌గా, అల్లు అర్జున్ కుమార్తె అర్హ ప్రిన్స్ భరతగా నటిస్తున్నారు. సమంత విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార కూడా నటిస్తున్నారు.

Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: