బాల‌య్య ఇచ్చిన షాక్‌ కి చిరంజీవి, వెంక‌టేష్ ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేరా ?

VUYYURU SUBHASH
తెలుగు సినిమాకు ప్రతి ఏటా సంక్రాంతి అతిపెద్ద సీజన్. ఆ తరువాత సమ్మర్, దసరా సీజ‌న్లు సినిమా రిలీజ్ కు అనువుగా ఉంటాయి. సంక్రాంతికి తెలుగు ప్రజలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఆ సమయానికి రైతుల‌కు పాడి పంటలు చేతికి వస్తాయి. మరో వైపు యువత అంతా సంక్రాంతి సెలవుల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరిని టార్గెట్ చేసేందుకు సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లలోకి వస్తాయి. గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఈ సంస్కృతిని కంటిన్యూ చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే సంక్రాంతికి ఒకే సారి ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద హీరోలు తమ సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వార్‌ను హీటెక్కిస్తూ ఉంటారు. అటు హీరోల అభిమానులు సైతం ఎవరికి వారు తమ హీరో సినిమా పై చేయి సాధిస్తుందని భారీ అంచనాలతో ఉంటారు.
2001 సంవత్సరంలో టాలీవుడ్ చరిత్రలోనే ఎవరు ఊహించని సంచలనం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి , యువరత్న నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ ముగ్గురు తమ సినిమాలతో బాక్సాఫీసు దగ్గర పోటీపడ్డారు. బాలయ్య - బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన నరసింహ నాయుడు , చిరంజీవి - గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన మృగరాజు , వెంకటేష్ - కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన దేవిపుత్రుడు సినిమాలు ఆ సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చాయి. జనవరి 11న మృగరాజు, నరసింహనాయుడు పోటాపోటీగా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. మృగరాజు పై భారీ అంచనాలు ఉన్నాయి. అప్పటికే వరుస ప్లాపులతో ఉన్న బాలయ్య న‌టించిన‌ నరసింహనాయుడు పై ఎలాంటి అంచనాలు లేవు.
అయితే నరసింహనాయుడు గోల్డెన్ జూబ్లీ సినిమా అయ్యింది. అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులకు పాత‌ర‌ వేసింది. మృగరాజు చిరంజీవి కెరీర్ లోనే పెద్ద మాయని మచ్చగా మిగిలిపోయింది. జనవరి 14న రిలీజ్ అయిన దేవిపుత్రుడు భారీ బడ్జెట్ తో తెరకెక్కి అంచనాలు అందుకోలేక పోయింది. ఈ సినిమా నిర్మాత ఎమ్మెస్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చింది. ఏదేమైనా ఇప్పటికీ ఆ మూడు సినిమాల పోటీ గురించి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా చర్చించుకుంటూ ఉంటారు. బాలయ్య నరసింహనాయుడు దెబ్బతో బాక్సాఫీస్ వద్ద మృగ‌రాజు, దేవి పుత్రుడు అడ్రస్ లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: