త్రిమూర్తుల పేర్లతో వచ్చిన సినిమాల రిజల్ట్ ఇదే ?

VUYYURU SUBHASH
త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని పురాణాలతో పాటు మనం కూడా చెప్పుకుంటున్నాము. కర్త ,కర్మ , క్రియ లకు వీరు ముగ్గురే కారణం. ఇక శాస్త్రాలు,  పురాణాలు చెప్పిన  ప్రకారం ఈ ముగ్గురు లేనిదే మానవ జన్మ లేదని స్పష్టం చేస్తున్నాయి. ఇకపోతే ఈ ముగ్గురు పేర్లతో సినీ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలు వచ్చాయి. అయితే అవి బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలను అందుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
త్రిమూర్తులలో మొదటి వారైనా బ్రహ్మ  పేరుతో మోహన్ బాబు ..బ్రహ్మ అనే సినిమాను తీశారు. ఈ చిత్రం 1992వ సంవత్సరంలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ డైరెక్షన్ చేసిన సినిమా. ఇక ఇందులో మోహన్ బాబు హీరోగా, శిల్పా శిరోద్కర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఐశ్వ‌ర్య మ‌రో హీరోయిన్‌గా న‌టించారు.
ఇక త్రిమూర్తుల్లో రెండవ వారైన‌ విష్ణు పేరుతో 2003వ సంవత్సరం లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై షాజీ కైలాస్ డైరెక్ట్ లో వచ్చిన చిత్రం విష్ణు. ఇందులో హీరోగా మంచు విష్ణు నటించాడు. ఇందులో హీరోయిన్ గా శిల్పా శివానంద్ ను సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇది కూడా బాక్సాఫీసు వద్ద చతికిల పడింది. ఇది మంచు విష్ణు డెబ్యూ సినిమా. ఇక త్రిమూర్తులలో మూడవ వారైన శివుడు పేరు మీద కూడా 1989వ సంవత్సరంలో అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ డైరెక్టర్ గా తెరకెక్కిన చిత్రం శివ.
ఇక ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయింది  కాకపోతే ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యి నాగార్జున సినీ జీవితాన్ని మరింతగా మార్చేసింది. అంతేకాదు తెలుగు చిత్ర గమనాన్ని తీర్చిదిద్దిన డైరెక్టర్ గా రాంగోపాల్ వర్మ రికార్డు సృష్టించారు. 1989లో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా వ‌సూళ్ల‌ వర్షం కూడా కురిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: