క్రికెటర్ కి కారు కొనిపెట్టిన తెలుగు హీరోయిన్..?

Divya
ప్రేమ అనేది ఎప్పుడు..? ఎలా..? ఎవరిలో..? మొదలవుతుందో చెప్పడం కష్టం. దీనికి కులమతాలు కానీ భావ బేధాలు కానీ ప్రాంతాలతో సంబంధం లేకుండా పరిచయమైన కొద్ది రోజులకే , వారు మనసులు ఒక్కటైతే అమ్మాయిలు వారిని ప్రేమించేస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే, క్రికెటర్లు , సినీ ఇండస్ట్రీలోని తారలు ప్రేమించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక అలాంటివారిలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూడా ఒకరు. వీరిరువురూ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన హీరోయిన్లు ఎక్కువగా క్రికెటర్లను ఇష్టపడుతున్నారు.
ఇందుకు గల కారణం ఏమిటంటే, వారు సినీ ఇండస్ట్రీలో నటించి ఇక్కడ బాగా పాపులారిటీని అందుకోగా , ఇక క్రికెటర్లు దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్  ను సంపాదించుకుని ఉంటారు. అలాంటి క్రికెటర్లను వివాహం చేసుకోవడం ద్వారా , వీరి క్రేజ్  మరింత పెరిగి పోతుంది. అంతేకాక భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆర్థిక నష్టాలు ఉండకపోవడం అనే  కారణం చేత కూడా కొంతమంది క్రికెటర్లను  పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇకపోతే మన తెలుగు హీరోయిన్ కూడా ఒక క్రికెటర్ ప్రేమలో పడిందనే వార్తలు దుమారం లేపుతున్నాయి.

ముంబైకి చెందిన ఒక క్రికెటర్ తో , ఆమె ప్రేమలో ఉన్నట్లు ఆయన కోసం లండన్ కి కూడా వెళ్ళినట్లు సమాచారం. అయితే వీరి ప్రేమ కేవలం గత కొద్ది రోజుల నుంచే మొదలైందని, ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని వార్తలు సినీ ఇండస్ట్రీలో పాటు,  క్రికెట్ వర్గాలలోనూ చర్చలు కొనసాగుతున్నాయి. అంతేకాదు వారిరువురి ప్రేమకు గుర్తుగా మన తెలుగు హీరోయిన్ ఆ క్రికెటర్ కు ఒక కారును కూడా  బహుమతిగా ఇచ్చిందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇక పోతే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు - హీరోయిన్లు కొంత కాలం డేటింగ్ చేసుకుని, ఆ తర్వాత నచ్చలేదని విడిపోతున్నారు. ఇక మరి వీరి జంట అయినా పెళ్లి పీటలు ఎక్కుతుందో..? లేదో ..? వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: