అరుంధతి మూవీ లో అనుష్క తండ్రి గా చేసింది ఎవరో తెలుసా?

Mamatha Reddy
టాలీవుడ్ లో ఎన్నో చరిత్రను తిరగరాసిన సినిమాలు తెరకెక్కించారు మన తెలుగు సినిమా దర్శక నిర్మాతలు. ఆ విధంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన అద్భుతమైన చిత్రం అరుంధతి. అరుంధతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమా లోనే ఒక సరికొత్త ప్రభంజనం సృష్టించింది ఆ రోజుల్లో. ఈ సినిమా తర్వాత అనుష్క రేంజ్ ఒక రేంజ్ కి వెళ్ళింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కోడిరామకృష్ణ కూడా తను దర్శకుడిగా సినిమాలు ఆపేయాలి అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా తో అందరికీ సమాధానం చెప్పి వారి నోళ్లను మూయించారు. శ్యాం ప్రసాద్ రెడ్డి కూడా నిర్మాతగా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి సినిమా ఎంతగానో ఉపయోగపడింది. ఈ విధంగా ఈ తరహాలో సినిమాలు చేయాలని చాలామంది ప్రయత్నించిన ఆ రేంజ్ లో ఏ సినిమా వర్కవుట్ అవ్వలేదు. ఎన్నో అవార్డులను రివార్డులను తెచ్చిపెట్టిన ఈ సినిమా గ్రాఫిక్స్ కూడా చాలా పాపులర్ అయ్యింది.  ఇందులో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. 

అరుంధతి సినిమాలో అనుష్క తండ్రిగా నటించిన నటుడు శంకర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకు ముందు ఎన్నో సీరియల్స్ లలో సినిమాలలో నటించిన ఈయన టేలివిజన్ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులు. ఆయన తనయులు కూడా సినిమా ఇండస్ట్రీ లోనే ఉన్నారు. వారే బాలాదిత్య, కృష్ణ కౌశిక్. వీరిద్దరు కూడా చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కృష్ణ కౌశిక్ ఎన్నో సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో కూడా నటించారు. బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్ గా అలాగే హీరోగా కూడా నటించారు. ప్రస్తుతం వీరు ఓ సీరియల్ లో కలిసి నటిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల తండ్రి ఈయన అని అప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: