నువ్వు లేక నేను లేను సినిమా మహేష్ ఎలా మిస్ అయ్యాడు..!

shami
కొన్నిసార్లు ఒక హీరోతో అనుకున్న సినిమా మరో హీరో చేసి హిట్ అందుకుంటారు. హీరో డేట్స్ అడ్జెస్ట్ కాకనో కథ సరిగా నచ్చకనో ఒక హీరో కోసం రాసుకున్న కథ కాస్త మరో స్టార్ చేయాల్సి వస్తుంది. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి వాటిలో తరుణ్ నువ్వు లేక నేను లేను సినిమా కూడా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మించిన నువ్వు లేక నేను లేను సినిమాను ముందు మహేష్ కోసం అనుకున్నారట. ఈ సినిమా డైరక్టర్ కాశీ విశ్వనాథ్ మహేష్ ను కలిసి కథ వినిపించారట.
సినిమా కథ మహేష్ కు నచ్చినా డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో కొన్నాళ్లు వెయిట్ చేయాలని చెప్పారట. అయితే వెయిటింగ్ తన వల్ల కాదని కాశీ విశ్వనాథ్ తరుణ్ తో సినిమా లాగించేశారు. తరుణ్ కెరియర్ లో ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. నువ్వే కావాలి తర్వాత తరుణ్ కు పెద్ద విజయాన్ని అందించిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. అలా మహేష్ కు పడాల్సిన నువ్వు లేక నేను లేను సినిమా తరుణ్ ఖాతాలో పడి సూపర్ హిట్ అందించింది.
ఒకవేళ నువ్వు లేక నేను లేను సినిమా మహేష్ చేసి ఉంటే ఫలితం ఇంకాస్త భారీగా వచ్చే అవకాశం ఉండేది. ఆ టైం లో వేరే సినిమాల బిజీ వల్ల మహేష్ ఈ సినిమాను లైట్ తీసుకున్నాడు. కాని ఓ హిట్ సినిమా మిస్ చేసుకున్నానని తర్వాత ఫీల్ అయ్యే ఉంటారు. స్టార్ సినిమాలు కథల జడ్జ్ మెంట్ చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి కథ సరిగా జడ్జ్ చేయకపోతే మంచి హిట్ సినిమా మిస్ అవ్వాల్సి వస్తుంది.  ఇదే కాదు మహేష్ ఇలాంటి హిట్ సినిమాలు చాలా వదులుకున్నాడని తెలుస్తుంది. అయితే తను వదులుకోవడమే కాదు వేరే హీరోలు కాదనుకున్న సినిమాలు తను చేసి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: