వేషాలు కావాలంటే హీరోతో పడుకోవాల్సిందే: హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

Suma Kallamadi
సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న ఆడవారిపై లైంగిక వేధింపుల జరుగుతున్నాయంటూ నిత్యం వార్తల్లో అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. 'మీటూ' ఉద్యమం తర్వాత చాలామంది నటీమణులు తమకు జరిగిన అన్యాయాలను బయటపెట్టారు. దీంతో సినిమా పరిశ్రమలో ఆడవారిపై ఇటువంటి ఘోరాలు జరుగుతాయా అని సామాన్య ప్రజలు అవాక్కయ్యారు. విశేషమేంటంటే.. 'మీటూ' ఉద్యమం హాలీవుడ్‌లో ఆరంభమయ్యింది. అనంతరం ఈ ఉద్యమం బాలీవుడ్‌లో ప్రవేశించింది. ఇక కాలక్రమేణా అనేక సంచనల విషయాలు బయటకు వచ్చాయి. సినిమా పరిశ్రమలో కామాంధుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంటే శ్రీరెడ్డి వంటి నటీమణులు పబ్లిక్ లోకి వచ్చి మరీ కామాంధుల బాగోతాలు బయటపెట్టారు. అయితే ఇప్పటికీ చాలామంది నటీనటులు తమకు జరిగిన అన్యాయాలను బయట పెడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఎదురైనా లైంగిక వేధింపుల గురించి సంచలన విషయాలు బయటపెట్టింది.
2004లో విడుదలైన ‘మర్డర్‌’ మూవీతో బాలీవుడ్‌ లో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ మల్లిక శెరావత్ హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె బోల్డ్ సన్నివేశాల్లో విపరీతంగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకు సెగలు పుట్టించింది. ఈ చిత్రం తర్వాత ఆమె మరికొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రేక్షకుల్లో ఎంతో అభిమానాన్ని సంపాదించినప్పటికీ.. సినీ పెద్దలతో చనువుగా ఉండకపోవడం వల్ల కక్షకట్టి తనకు వచ్చిన ప్రతి అవకాశం చెడగొట్టారని.. తనకున్న నటనా ప్రతిభకు తగిన అవకాశాలు దక్కలేదని ఆమె గతంలో ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు ఆమె ఒక అడుగు ముందుకేసి సినీ ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయాల గురించి పెదవి విప్పింది.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మల్లికా శెరావత్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని.. కొందరు హీరోలు తమ కామవాంఛ తీర్చినందుకు తనకు వేషాలు రాకుండా చెడగొట్టారని ఆరోపించింది. తాను సినిమా ఇండస్ట్రీలో అరంగ్రేటం చేసినప్పుడు ప్రజలపై మీడియా ప్రభావం పెద్దగా ఉండకపోయేదని.. ఇండస్ట్రీలో జరుగుతున్న రహస్య విషయాల గురించి ఎక్కువగా వార్తలు వచ్చేవి కాదని ఆమె అన్నారు. తన కెరీర్ తొలినాళ్లలో ఓ యాక్ట్రెస్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే హీరోతో తప్పకుండా పడుకోవాల్సిందే అన్నట్లు ఉండేదని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. సినిమాల్లో అనవసరమైన సెక్సీ సన్నివేశాలు పెట్టేవారని చెప్పుకొచ్చిన ఆమె.. కెమెరా ముందు బోల్డ్ గా ఉన్నప్పుడు.. నిజ జీవితంలో ఎందుకు అలా ఉండలేవు? అంటూ చనువు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారని ఆమె వెల్లడించింది.
సినీ ఇండస్ట్రీలో ఇటువంటి వారికి చాలా దూరంగా ఉండటం వల్లే తాను అవకాశాలన్ని కోల్పోయానని ఆమె చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. వర్ధమాన నటీమణులు కూడా నాలాగానే లైంగిక వేధింపులు ఫేస్ చేస్తున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: