సినిమా టైటిల్‌ని ఇంటిపేరుగా మార్చుకున్న స్టార్ కమెడియన్..?

Suma Kallamadi
సుమారు 350-500కు పైగా చిత్రాల్లో నటించి టాలీవుడ్ పరిశ్రమ లో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సత్యం రాజేష్ కి ప్రత్యేకించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. వందల సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేసిన సత్యం రాజేష్ అసలు పేరు రాజేష్ బాబు. విశాఖపట్నం లో పుట్టి పెరిగిన ఆయన ఎంబీఏ పూర్తి చేసి వైజాగ్ లోని మహీంద్రా కంపెనీలో ఉద్యోగం చేశారు. అయితే కొద్ది నెలల తర్వాత ఆయన హైదరాబాద్ లోని మహీంద్రా కంపెనీకి బదిలీ అయ్యారు. ఆ తర్వాత ఆయన నటన పై మక్కువతో సినిమాల్లో ప్రయత్నించారు. అయితే ఆయన తన కామెడీ టైమింగ్ తో దర్శకులను మెప్పించి సినిమా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. జోరుగా హుషారుగా, నీ స్నేహం వంటి చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్న రాజేష్ ఆ తర్వాత సంబరం, సత్యం సినిమాల్లో నటించారు.

అయితే సత్యం సినిమా లో పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అంటూ తన అద్భుతమైన కామెడీ డైలాగులతో ప్రేక్షకులని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన రాజేష్ నంది అవార్డుకి నామినేట్ అయ్యారు. దీంతో ఆయన ఓవర్‌నైట్‌ కమెడియన్ స్టార్ అయ్యారు. అయితే తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన "సత్యం" సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన అనేక సినిమాల్లో తన హిలేరియస్ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. మిర్చి సినిమాలో అనుష్క శెట్టికి బావ గా నటించి ఆయన హాస్యాన్ని పండించారు. 2021 సంవత్సరం లో బంగారు బుల్లోడు, రంగ్ దే వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.


హాస్య నటుడిగా మాత్రమే కాదు సీరియస్ నటుడిగా కూడా నటించి మెప్పించారు. క్షణం సినిమాలో ఆయన నటనకు సినీ విమర్శకులు సైతం మంత్రముగ్ధులయ్యారు. త్రిష ఫిమేల్ లీడ్ రోల్లో నటించిన నాయకి చిత్రంలో ఆయన హీరోగా నటించారు. ఇక ఆ తర్వాత ఆయన ఏ చిత్రంలోనూ హీరోగా నటించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: