మాకో 'మా' ఉందంటున్న డైరెక్టర్!

Suma Kallamadi

ఆంధ్రప్రదేశ్ రాష్టండైలో తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా ఐదేళ్ల కింది నుంచే ఉందని మా ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్ రాజా ప్రకటించారు. మా ఏపీని నూతనంగా నెలకొల్పాలని కొంత మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన నటులు చేస్తున్న వ్యాఖ్యల పై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మా ఏపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ర్టాలుగా విభజించినపుడే... సినీ రంగంలోని 24 విభాగాలతో ఆంధ్రప్రదేశ్ లో మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ను నెలకొల్పినట్లు తెలియజేశారు. ఏదో నామమాత్రంగా, నామ్ కే వాస్తే నెలకొల్పడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా తగిన గుర్తింపును కూడా మా పొందినట్లు తెలియజేశారు. ప్రముఖ సినీ నటులు కవిత అధ్యక్షురాలిగా, నరసింహ రాజు ప్రధాన కార్యదర్శిగా, అన్నపూర్ణమ్మ కార్యదర్శిగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ యూనియన్ లో తెలుగు ఇండస్ర్టీలోని బుల్లితెర, వెండి తెరలకు సంబంధించిన 24 డిపార్ట్ మెంట్ ల వారు దాదాపు 500 మంది సభ్యులుగా ఉన్నారని ప్రకటించారు. రాష్ర్ట విభజన నేపథ్యంలోనే ఏపీలో కూడా మాని స్థాపించామని, హైదరాబాద్ లో ఉన్న మాకు తాము ఏ మాత్రం వ్యతిరేఖం కాదని తెలిపారు.  

కళమ్మ తల్లి ఒడిలో ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లా ఉండే మా సభ్యుల ఎన్నికలు సమాజంలో ఇంత చర్చనీయాంశం కావడం దురదృష్టకరమని దిలీప్ రాజా ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ హీరోలు మా ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. మా ఎన్నికలను ఏకపక్షం చేయాలని చిరంజీవి, బాలక్రిష్ణ, మోహన్ బాబులకు చేతులు జోడించి విన్నవిస్తున్నట్లు తెలిపారు. పోటీలో ఉన్న అందరితో మాట్లాడి.. ఒకరికి కొంతకాలం మరొకరికి కొంతకాలం పదవి వచ్చేలా మాట్లాడి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని, మా ఖ్యాతిని మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: