అనేక ఇబ్బందులు పడుతున్న నటుడు నరసింహరాజు

Mamatha Reddy
చిత్ర పరిశ్రమ అంటేనే ఓ మాయలోకం. ఈ రంగుల ప్రపంచంలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో కూడా ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎవరిని పడేస్తుందో కూడా తెలియదు. ఒకసారి హిట్ కొడితే పలకరించే అదే సినీ జనాలు ఫ్లోప్ వస్తే మాత్రం పట్టించుకోరు.. అప్పటిదాకా ఉన్న పరిస్థిత ఒకటైతే ఫ్లోప్ వచ్చినప్పుడు ఎదురయ్యే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అందుకే మన సినిమా వాళ్ళు ఫ్లోప్ సినిమాకు దూరంగా ఉంటారు.  హిట్టుతో ఎంత గుర్తింపు వస్తుందో ఫ్లాప్ తో అంతకంటే దారుణ స్థితి నెలకొంటుంది.

నార్మల్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఇండస్ట్రీలో సెకండ్ హీరోలు స్టార్ హీరోలుగా రాణించిన వారు సైతం, పోటీ ఇచ్చి కూడా ఆ తర్వాత ఛాన్సులు లేక చతికిల పడతారు. అలాంటి వారిలో ఒకరు నరసింహ రాజు. ఆయన అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, సుమన్ లకు గట్టి పోటీ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో జానపద హీరోగా మంచి పేరు తో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన. 

చిరంజీవి హీరోగా నటించిన పున్నమి నాగు సినిమా లో మరొక హీరోగా చేసిన నరసింహరాజు జానపద చిత్రాల్లో ఆరితేరిన విఠలాచార్య రూపొందించిన జగన్మోహిని సినిమా కూడా చేశారు. ఈ మూవీతో నరసింహ రాజు కి వరుస ఆఫర్లు వచ్చాయి. జానపద చిత్రాలతో పాటు సాంఘిక చిత్రాల్లో కూడా నరసింహరాజు నటించారు. సినిమాకు బ్రేక్ ఇవ్వడంతో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. అన్ని భాషల్లో కలిపి 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయన సీరియల్స్ లో కూడా నటించారు.  ముఖ్యంగా చెప్పాలంటే అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి బాగోలేదు. ఛాన్సులు లేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: