దళపతి విజయ్ పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్..?

Suma Kallamadi
తమిళ హీరో ఇళయదళపతి విజయ్‌ జూన్ 22వ తేదీన తన 47వ వసంతంలో అడుగు పెట్టనున్నారు. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల కోసం అదిరిపోయే ఓ అప్‌డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు సంబంధించి గానీ లేదా కొత్త సినిమాకి సంబంధించి గాని ఏదో ఒక అనౌన్స్‌మెంట్ ఖచ్చితంగా రానుందని కోలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఐతే ఆయన పుట్టిన రోజున అభిమానులకు ఒక శుభవార్త అందించడం ఎప్పటినుంచో వస్తున్న ఒక ఆనవాయితీ కానీ ఈసారి ఏ అప్‌డేట్ రానుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫ్యాన్స్ కూడా ఆయన పుట్టిన రోజు ట్రీట్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికర వార్త తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.
అదేంటంటే.. బర్త్ డే సందర్భంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో విజయ్ చేయనున్న ఓ కొత్త సినిమాకి సంబంధించి ఒక ప్రకటన విడుదల కానుందట. ఈ కరోనా మహమ్మారి సమయంలోనే దళపతి పుట్టినరోజు సందర్భంగా వంశీపైడిపల్లి - విజయ్ కాంబో సినిమా అనౌన్స్ చేసి అభిమానులను ఖుషి చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఈ సినిమాని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇకపోతే ప్రస్తుతం విజయ్.. "కోలమవు కోకిల" ఫేమ్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తన 65వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అగ్రతార పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు ముందు ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్‌ షూటింగు ఈజిప్టులో పూర్తి చేశారు. అయితే ఈ సినిమాకి ‘టార్గెట్‌’ అనే టైటిల్‌ ఖరారు చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: