ఉదయ్ కిరణ్ చెల్లెలు టాలీవుడ్లో స్టార్ సింగర్ అని మీకు తెలుసా.. ?

Mamatha Reddy
టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ చిరంజీవి ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చిత్రం సినిమాతో పరిచయమై నువ్వు నేను మనసంతా నువ్వే సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత ఆయన తన సినిమా అవకాశాల కోసం వెనుతిరిగి చూసుకోలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతో కష్టపడి సినిమాల్లో మంచి పేరు సంపాదించడం అనేది మామూలు విషయం కాదు. అలా ఆయన నటించిన తొలి చిత్రంతోనే మంచి ప్రశంశలు పొందిన ఉదయ్ కిరణ్ నువ్వు నేను చిత్రానికి నంది అవార్డు అందుకుని చరిత్ర సృష్టించారు.
తమిళంలో కమల్ హాసన్ ఇంత చిన్న వయసులో అవార్డు సంపాదించగా తెలుగులో ఉదయ్ కిరణ్ ఈ ఘనత సాధించారు. తన మొదటి నాలుగు సినిమాలు రీమేక్ చేసిన ఏకైక తెలుగు నటుడు ఉదయ్ కిరణ్.  కాలేజీ లో ఉన్నప్పుడు ఏ సినిమా లో చేయకముందు సినిమాల్లో అవకాశక వేట ప్రారంభించాడు ఉదయ్ కిరణ్. అలా 17 సంవత్సరాల వయసులోనే డైరెక్టర్ తేజ ను కలిసి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు.  తను చేసిన సినిమాల్లో నీస్నేహం, కలుసుకోవాలని, శ్రీరామ్ వంటి చిత్రాలు ఉదయ్ కిరణ్ ఫ్లాప్ లు ఇచ్చాయి. దాంతో సినిమాల విషయంలో వెనుక పడిపోయాడు.
అదే సమయంలో చిరంజీవి కుమార్తె సుస్మితతో ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయ్యింది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా, ఈ క్రమంలోనే ఆయనకు సినిమాలు  లేక డిప్రెషన్ లో సూసైడ్ చేసుకుని చనిపోయారు. అయితే ఇండస్ట్రీ ఓ సింగర్ ఆయనకు చెల్లలు అవుతుందని ఎవరికీ తెలియదు. పర్ణిక మాన్య ఉదయ్ కిరణ్ బంధువుల అమ్మాయి. ఆయనకు వరుసకు చెల్లెలు అవుతుంది. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ సింగర్ గా బాహుబలి సినిమాలో చాలా పాటలు పడి ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు ఆమె. గీత మాధురి క్లోజ్ ఫ్రెండ్ అయిన ఈమె ఆమెతో కలిసి ఎన్నో వీడియోస్ చేశారు. ఈమె ఉదయ్ కిరణ్ చెల్లెలు అని ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: