ఓటీటీ మీద మోజు పెంచుకుంటున్నారే... ?

Satya
ఓటీటీ ఫ్లాట్ ఫారం ఇపుడు నెమ్మదిగా అందరికీ అర్ధమవుతోంది. అలాగే ఇది అనివార్యమని కూడా బోధపడుతోంది. ఇక ఇది సినిమా రంగానికి సమాంతరంగా ఎదుగుతున్న మరో విభాగమని కూడా తెలుస్తోంది.
ఓటీటీ అంటే ఒకనాడు పెద్దగా పట్టించుకోని నిర్మాతలు చిన్న హీరోలు ఇపుడు ఇదే చక్కని వేదిక అవుతుంది అని భావిస్తున్నారు. సినిమాలో హీరోలుగా ఒక వెలుగు వెలిగి రేసులో వెనకబడిన వారు, సినిమాలో అవకాశాలు రాని వారు, వచ్చినా సినిమాకు తగిన థియేటర్లు దక్కని వారు, లో బడ్జెట్ మూవీస్ చేసుకునే వారు ఇపుడు పెద్ద ఎత్తున ఓటీటీల మీద పడ్డారు.చంటిగాడు సినిమాతో వెండితెర మీద హీరోగా ఇంట్రడ్యూస్ అయిన బాలాదిత్య కొన్ని సినిమాలు చేసినా సక్సెస్ అన్నది దక్కలేదు. అయితే ఇపుడు బాలాదిత్య తన సెకండ్ ఇన్నింగ్స్ ని ఓటీటీల ద్వారా ప్రారంభించాలని భావిస్తున్నాడుట. వెబ్ సిరీస్ లో నటించడం ద్వారా హీరోగా మరింతగా రాణించాలని ఆయన భావిస్తున్నాడు.
ఇదే తీరున టీవీ నటులు, హీరోలుగా నిలబడాలని ట్రై చేసి విసిగిన వారు కూడా వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ద్వారా జనాల ముందుకు రావాలని చూస్తున్నరు. ఇక్కడ వీరు అనే మాట ఒక్కటే. ఏది అయినా అల్టిమేట్ గా జనాలకు రీచ్ కావాల్సిందే. ఈ రోజు పెద్ద తెర చిన్న తెర అంటున్నారు. ఓటీటీలను బుల్లి తెర అనుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ వారికీ మనం రీచ్ అవుతామని కూడా వారు అంటున్నారు. రిస్క్ పెద్దగా లేకపోవడంతో మంచి కధలను ఎంచుకుంటే జనాలను అట్రాక్ట్ చేయవచ్చు అని కూడా వారు అంచనా వేస్తున్నారు. ఇక చిన్న నిర్మాత అన్న వాడు ఇపుడు పోటీ సినీ ప్రపంచంలో పత్తా లేకుండా పోయాడు. అలాంటి వారు కూడా ఓటీటీలనే ఆశ్రయిస్తున్నారు. మొత్తానికి కరోనా తగ్గినా థియేటర్లు తెరచుకున్నా కూడా ఓటీటీలు అన్నవి గట్టి పోటీయే ఇస్తాయని అంటున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని ముందు ముందు ఓటీటీలకే యమ డిమాండ్ వస్తుందని కూడా కొంతమంది సినీజీవులు భవిష్యత్తు జాతకాన్ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: