బాలీవుడ్ లో హీరోల సహకారం టాలీవుడ్ హీరోల సహాయనిరాకరణ !

Seetha Sailaja
కరోనా సెకండ్ వేవ్ కొంతవరకు అదుపులోకి వస్తున్నప్పటికీ థర్డ్ వేవ్ గురించి వస్తున్న వార్తలు హోరెత్తి పోతున్నాయి. భారత్ లో కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేకపోయినప్పటికి ఈ సంవత్సరంలోనే థర్డ్ వేవ్ ఖాయం అన్న అంచనాలు వస్తున్నాయి. దీనితో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోని అనేకమంది నిర్మాతలు కలవర పడుతున్నట్లు టాక్.

జూలై నుండి ధియేటర్స్ తెరుచుకునే అవకాశం ఉన్నప్పటికీ మళ్ళీ కొద్ది గ్యాప్ లో థర్డ్ వేవ్ మొదలై ధియేటర్స్ మళ్ళీ మూతపడితే ఇక ఇండస్ట్రీని రక్షించడం ఎవరివల్లా కాదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనితో అనేకమంది నిర్మాతలు ఓటీటీ సంస్థలు ఆశక్తికనపరుస్తున్న అనేక మీడియం రేంజ్ సినిమాలను వీలైనంత త్వరగా ఓటీటీ సంస్థలకు అమ్మాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ నిర్మాతల ప్రయత్నాలకు మీడియం రేంజ్ హీరోలు అడ్డు తగులుతున్నట్లు టాక్.

మీడియం రేంజ్ సినిమాలలో మంచి క్రేజ్ సంపాదించుకున్న అనేక మూవీల నిర్మాతలకు ఓటీటీ సంస్థలు ఇస్తున్న ఆఫర్లు ఒప్పుకోలేకపోవడానికి హీరోలే ప్రధానకారణం అన్న వార్తలు వస్తున్నాయి. ధియేటర్లలో కాకుండా తమ సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా విడుదల చేస్తే తమ హీరోల ఇమేజ్ తగ్గిపోయి తమని హీరోలుగా కాకుండా ఓటీటీ స్టార్స్ ల చూస్తారని మన టాలీవుడ్ అభిప్రాయం అని తెలుస్తోంది.

అయితే ఈ పరిస్థితి బాలీవుడ్ లో చాల భిన్నంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో రిలీజ్ కు రెడీగా ఉన్న అనేక భారీ మీడియం రేంజ్ సినిమాలను ఓటీటీ లలో రిలీజ్ చేసి పెరిగిపోతున్న వడ్డీల భారం నుండి బయటపడామన్ అక్కడి హీరోలు నిర్మాతలకు సలహాలు ఇచ్చి సహకరిస్తుంటే మన హీరోలు మాత్రం నిర్మాతల కష్టాల పై మౌనంగా ఉంటున్నారు అంటూ అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉన్న అనేక మీడియం రేంజ్ సినిమాల నిర్మాతలు ఈ కరోనా సమయంలో తమ కష్టాలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అంతర్మధనంలో ఉన్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: