ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు : మీనా

Divya

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది సినీ నటులు బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత స్టార్ హీరో హీరోయిన్ లుగా ఎదుగుతున్నారు. ఇక అలాంటి వారిలో సీనియర్ నటి మీనా కూడా ఒకరు. మీనా సెప్టెంబర్ 16 1975 సంవత్సరంలో దురైరాజ్, రాజ మల్లిక దంపతులకు మద్రాస్ లో జన్మించింది.  ఈమె తండ్రి తమిళనాడులో నివాసం ఏర్పాటు చేసుకున్న  తెలుగు కుటుంబానికి చెందినవారు. ఇక వృత్తి రీత్యా ప్రభుత్వ పాఠశాలలో  మాస్టర్ గా పని చేస్తున్నారు.ఇక ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినీ నటి. మీనా తన చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళంలో 1982 లో వచ్చిన నెంజంగల్ అనే సినిమా ద్వారా  సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఇక ఆ తర్వాత తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ తోపాటు హిందీ చిత్రాలలో కూడా నటించి, తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. బాలనటిగా కమల్ హసన్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించింది. ఆ తర్వాత ఈమె తెలుగులో నవయుగం చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత తెలుగు అగ్రహీరోలు అయినా చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రాజశేఖర్ వంటి పలువురు హీరోలతో నటించి అందరిని మెప్పించింది. అంతేకాదు రజనీకాంత్ నటించిన ఒక సినిమాలో ఈమె కూడా నటించి ,అది జపాన్ లో కూడా విడుదలై, మంచి ఆదరణ పొందడంతో ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమాన సంఘాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా మీనా తెలుగులో నటించిన మొట్టమొదటి చిత్రం "నవయుగం " సినిమా విడుదల అయ్యి , మే 5 వ తేదీ నాటికి 30 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేసుకుంది. ఇలా మీనా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..అందులో భాగంగానే.. " సమయం అనేది చాలా వేగంగా పరుగెడుతోంది. నేను సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 సంవత్సరాలు కావస్తోంది అంటే నాకే నమ్మశక్యంగా లేదు. ఇప్పటి వరకు నేను నటించిన అన్ని సినిమాలను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది . ఈ సినిమాలు  అన్నీ ఇంత సక్సెస్ అవ్వడం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అంటూ ".. అంటూ ఆమె వీడియో ద్వారా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: