యుకె లో కౌశల్ భార్య నీలిమ కు కరోనా కష్టాలు !

Seetha Sailaja

మన దేశంలో ప్రభుత్వ హాస్పటల్స్ పరిస్థితి అద్వానంగా ఉంటుంది కాబట్టి దేశంలోని ప్రతి వ్యక్తి తనకు అనారోగ్య సమస్యలు ఏర్పడితే ప్రవేటు హాస్పటల్స్ వైపు పరుగులు తీస్తుంటారు. అదే విదేశాలలో అయితే ప్రభుత్వ హాస్పటల్స్ అద్భుతంగా ఉంటాయని భావిస్తూ మనదేశ పరిస్థితుల పై నిరాశ చెందుతూ ఉంటారు.

అయితే ఈ విషయంలో ‘బిగ్ బాస్ 3’ విన్నర్ కౌశల్ భార్య నీలిమకు ఎదురైనా కరోనా కష్టాలు చదివిన వారికి దూరపు కొండలు నునుపు అన్న సామెత గుర్తుకు వస్తుంది. కొద్దిరోజుల క్రితం కౌశల్ తన భార్య నీలిమ ఆరోగ్యం గురించి ఒక పోస్టు పెట్టాడు. దీనితో ఆమెకు ఏమైంది అంటూ అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. 'ఏదో సాధించాలని వెళ్లిపోయావు. ఏదో ఒకటి సాధించాలని జీవితంతో పోరాడుతున్నావు, నీకున్న ధైర్యంతో అది సాధిస్తావని తెలుసు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా, లవ్‌ యూ, మిస్‌ యూ నీలిమ' అంటూ సోషల్‌ మీడియాలో కౌశ‌ల్ పెట్టిన పోస్టులకు లేటెస్ట్ గా నీలిమ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ద్వారా సమాధానం దొరికింది.

ప్రస్తుతం లండన్ లో ఉంటున్న నీలిమ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. "నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ పనిచేసే చోట ఓ వ్య‌క్తి వ‌ల్ల ఏడు రోజుల క్రితం నాకు కరోనా సోకింది. ఇండియాలో చాలా దారుణమైన, భయంకర పరిస్థితులు ఉన్నాయని అనుకుంటారు. కానీ ఇక్కడే ఘోరంగా ఉంది. కోవిడ్ బారిన ప‌డిన నాకు ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చింది. నా పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని వైద్యుల‌కు చెప్తే వారు కేవలం పారాసిటమాల్‌ టాబ్లెట్‌ మాత్రమే ఇచ్చారు. అంత‌కు మించి పెద్దగా పట్టించుకోలేదు. పైగా క‌రోనా ల‌క్ష‌ణాలు అలాగే ఉంటాయ‌ని ధైర్యం చెపుతున్నారు.’ అంటూ తన గోడు వెళ్ళబుచ్చుకుంది.

ఇప్పుడు ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కరోనా పరిస్థితులు వల్ల మన దేశంలో ప్రభుత్వ హాస్పటల్స్ వ్యవస్థ అతలాకుతలం అయి చేతులు ఎత్తేసింది అని విమర్శలు చేసే వారికి ప్రపంచంలో ఎక్కడైనా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి అని అనిపించడం సహజం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: