బాలుకు తెలుగు భాష అంటే ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం!

Chaganti
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషల్లో అందరు హీరోలకు వాళ్లకు బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు పాటలు పాడి అనితర సాధ్యుడు అనిపించుకున్న బాలసుబ్రహ్మణ్యం పుట్టిన రోజు నేడు. ఈ సంధర్భంగా ఆయనకు తెలుగు మీద ఎంత మమకారం ఉందొ తెలుసుకుందాం. ఆయన పాటలు పాటటమే కాదు.. పాటలోని మాధుర్యాన్ని ప్రేక్షకులకు పంచడంలో ఎంతోమంది వర్థమాన గాయకుల్ని ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా పరిచయం చేశారు. ఉష , కౌసల్య , గోపిక పూర్ణిమ, మల్లికార్జున్, సందీప్, హేమచంద్ర, కారుణ్య ఇలా ఎందరెందరికో ఒక స్టేజ్ కల్పించి సింగర్స్ గా మార్చి వందలాది పాటలు పాడించిన ఖ్యాతి, ఘనత ఎస్పీ బాలుకే దక్కింది. 


బుల్లితెర ప్రేక్షకుల సాక్షిగా ఎందరో సింగర్స్‌కి లైఫ్ ఇచ్చారు. ఈటీవీలో ప్రసారమైన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం 1996 మే 16న ప్రారంభమై.. 2016 వరకు నిర్వరామంగా ప్రసారమై.. భారతదేశంలో మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షో గా మారి సంగీత ప్రియులకు వినోదాన్ని పంచింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సాలూరి రాజేశ్వరరావు, కె.విశ్వనాథ్, కె.వి. మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజా, కె.బాలచందర్, కీరవాణి, సుశీల, జానకి లాంటి ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాలుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 


ఈ ‘పాడుతా తీయగా’ కార్యక్రమంతో ఎంతో మంది చిన్నారులను సింగర్స్‌గా తీర్చిదిద్దారు బాలు.  బాలు అంటే పాడుతా తీయగా.. పాడుతా తీయగా అంటే బాలు అన్నట్లుగా ప్రేక్షకుల మనసును దోచిన ఈ షో మొత్తం మీద బాలు తెలుగులోనే మాట్లాడే వారు. పోటీదారులు కూడా తెలుగులోనే మాట్లాడాలనే రూల్ ఉండేది కూడా. అలా ఆయన తెలుగు మీద తన మమకారాన్ని చోపారు.  ప్రతిభ ఉన్న గాయనీ గాయకులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: