దిమ్మతిరిగే బ్యాగ్రౌండ్.. కానీ అడ్రస్ లేకుండా పోయిన 10 హీరోలు

Mamatha Reddy
సినిమా ఇండస్ట్రీలో వారసత్వపు నటులు రావడం చాలా సహజం. తండ్రి పేరు చెప్పకోనో, మామ పేరు చెప్పుకొనో, బాబాయ్ పేరు చెప్పుకోనో ఏదో రకంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా నిలదొక్కుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వారసత్వం ఉన్నంత మాత్రాన వారు సక్సెస్ కారు. ఎలాంటి టాలెంట్ లేకుండా కేవలం వారసత్వం అనే ట్యాగ్ తో రాణించడం అంత ఆషామాషీ కాదు. అలా పెద్ద బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చి రాణించలేక కనుమరుగైపోయిన హీరోలు ఎంతోమంది ఉన్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకటి రెండు సినిమాలకే పరిమితం అయిపోయాడు. పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు ఎంత ప్రయత్నించినా కూడా రమేష్ బాబును హీరోగా నిలబెట్టే లేకపోయారు. కానీ అదే కృష్ణ వారసుడిగా వచ్చిన మహేష్ బాబు మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. దర్శకుడిగా ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను చేసి, ఎంతో మంది హీరోలను తయారుచేసి, మరెంతో మంది నటులను తీర్చిదిద్దిన దాసరి నారాయణరావు సొంత కొడుకు దాసరి అరుణ్ కుమార్ ను హీరోగా నిలబెట్టే లేకపోయాడు.
అక్కినేని నాగేశ్వరరావు పేరు చెప్పుకొని చాలామంది ఇండస్ట్రీలోకి రాగా అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇతర హీరోలైనా సుమంత్ సుశాంత్ లు ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. దర్శకుడు రాఘవేంద్ర రావు ఎన్ని గొప్ప చిత్రాలు చేసిన ఏం లాభం ఆయన కొడుకు ప్రకాష్ ను దర్శకుడిగా, నటుడిగా ఏవిధంగా నిలబడలేక పోయాడు. మెగా హీరో అల్లు శిరీష్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకై ఉండి కూడా ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయాడు. చంద్రబాబు తమ్ముడు కొడుకు నారా రోహిత్,  పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్, మెగా బ్రదర్ నాగబాబు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి సినిమా లలో నిలదొక్కుకోలేకపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: