షాకింగ్ ఆగష్టు ను షేక్ చేయబోతున్న ఆ సినిమాల క్యూ !

Seetha Sailaja
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అదుపులోకి వచ్చి ఆగస్ట్ నుండి ధియేటర్స్ ఓపెన్ అవుతాయి  అన్న గట్టి నమ్మకంలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు జూన్ రెండో వారం నుంచి షూటింగ్ లకు అవకాశం కనిపిస్తోంది. లాక్ డౌన్ లేదా కర్ఫ్యూలు అన్న పదాలు ఇక జూన్ నెల మధ్య నుంచి వినిపించవు అన్న గట్టి నమ్మకంలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి.

జూన్ రెండో వారం నుంచి మళ్ళీ షూటింగ్ లు మొదలైన తరువాత ప్యాచ్ వర్క్ లు మిగతా  చిన్నచిన్న పనులు పూర్తి చేసుకుని ఆగష్టులో విడుదల అవడానికి సుమారు 30కి పైగా చిన్న  సినిమాలు నుంచి మీడియం రేంజ్ సినిమాలు రెడీగా ఉన్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు ఉన్నప్పటికీ ఆ విషయాలను పక్కకు పెట్టి ‘క్రాక్’ సక్సస్ ను ఆదర్శంగా తీసుకుని సినిమాలు అన్నీ విడుదలకు రెడీ అయిపోతున్నాయి.

కరోనా ఫస్ట్ వేవ్ తరువాత జనవరి ఫిబ్రవరి నెలలలో ఇలాగే జరిగింది. వారానికి 4 నుండి 5 సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీ విడుదల అయిపోయాయి. అందులో సక్సస్ అయినవి కనీసం 5 సినిమాలు కూడ లేవు. కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా రెండవ వారం ధియేటర్లలో కొనసాగ లేకపోయాయి.

అయితే ఈ విషయాలను ఏమాత్రం లెక్కచేయకుండా ఆగష్టు నెల అంతా చిన్న మీడియం రేంజ్ సినిమాల వార్ జరగబోతోంది. ఇన్ని సినిమాలకు ధియేటర్లు దొరకడం ఒక సమస్య అయితే ప్రేక్షకులను తమ సినిమాల వైపు రప్పించుకోవడం మరింత కష్టమైన పని. అయితే ఈ చిన్న సినిమాల నిర్మాతలు రోజురోజుకు పెరిగిపోతున్న వడ్డీల భారం తట్టుకోలేక ఇలాంటి సాహసానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సాహసం పై చిన్న సినిమా నిర్మాతలకు సలహాలు ఇవ్వవలసిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు మౌనంగా ఉంది అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: