టాలీవుడ్ లో 10 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - హీరో 'కాంబో'లు ఏంటో తెలుసా ?

Chaganti
ఒక హీరోకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ లు ఎలా అయితే కనెక్ట్ అవుతారో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా సింక్ అవుతారు. ఇలా ఫస్ట్ టైం వర్క్ చేసి హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ ని మన హీరోస్ రిపీట్ చేసి వారికి హిట్ ఆల్బమ్స్ ని ఇచ్చే ఛాన్స్ ఇచ్చారు. మన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కొందరు హీరోస్ కి వారి కెరీర్ లో అదిరి పోయే ఆల్బమ్స్ ఇచ్చి వాహ్ అనిపించుకున్నారు. మరి ఆ బెస్ట్ హీరో- మ్యూజిక్ డైరెక్టర్స్ కాంబినేషన్స్ ఏంటో ఓ సారి చూస్తే


ఎస్ ఎస్ థమన్ & రవితేజ – 11 మూవీస్

ఒకప్పుడు చక్రి రవితేజది ఎంత బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయిందో ఇప్పుడు తమన్ రవితేజది కూడా అలాగే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయింది. కిక్ సినిమాతో మొదలైన వీరిద్దరి జర్నీ ఇటీవల విడుదలైన క్రాక్ సినిమా దాకా కొనసాగుతోంది.

మణి శర్మ చిరంజీవి

బావ గారు బాగున్నారు లాంటి మ్యూజికల్ హిట్స్ తో ప్రారంభమైన ఈ జర్నీ ఆతర్వాత చూడాలని ఉంది, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్ లాంటి ఎన్నో అదిరిపోయే మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఆచార్య సినిమా కోసం పని చేస్తున్నారు.

మహేష్ బాబు మణి శర్మ

మహేష్ బాబు మొదటి సినిమా రాజకుమారుడుకి సూపర్ సాంగ్స్ ఇచ్చారు మణిశర్మ. అలా దాదాపు వీరిద్దరూ కలిసి 11 సినిమాలు చేశారు. అందులో ఒక్కడు, మురారి, టక్కరి దొంగ ఆల్ టైం హిట్ ఆల్బమ్స్ గా కూడా నిలిచాయి..

దేవి శ్రీ ప్రసాద్ అల్లు అర్జున్

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దాదాపు ప్రతి ఆల్బమ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఆర్య దగ్గర మొదలైన మీరు జర్నీ ఆర్య 2 జులాయి ఇద్దరమ్మాయిలతో లాంటి అనేక మ్యూజికల్ హిట్స్ అందుకుంది.

చక్రి రవితేజ

దివంగత సంగీత దర్శకుడు చక్రి రవితేజ కాంబినేషన్ వచ్చిన ప్రతి ఆల్బం అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, కృష్ణ, నేనింతే ఇలా చెప్పుకుంటూ పోతే వీరి ప్రతి సినిమాలో కచ్చితంగా మూడు నాలుగు పాటలు అయినా హిట్ అయ్యాయి.

ఆర్ పి పట్నాయక్ ఉదయ్ కిరణ్

చిత్రం వంటి సూపర్ హిట్ తర్వాత నువ్వు నేను అనే సినిమాకి అందించిన సాంగ్స్ అప్పట్లో ఎలాంటి ట్రెండ్ సెట్ చేశాయో వేరేగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరాం, హోలీ, అవునన్నా కాదన్నా సినిమా సూపర్ హిట్స్ గా నిలిచాయి.

మణి శర్మ పవన్ కళ్యాణ్

చిరంజీవి, మహేష్ బాబు తర్వాత మళ్లీ మణిశర్మ అలాంటి ఆల్బమ్స్ ఇచ్చిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్. ఖుషి, గుడుంబా శంకర్ లాంటి సూపర్ హిట్ కాంబోలతో పాటు బాలు, కెమెరామెన్ గంగతో రాంబాబు, లాంటి మంచి సినిమాలు కూడా చేశారు.

డీఎస్పీ ఎన్టీఆర్

దేవి శ్రీ ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి దాదాపు ఏడు సినిమాలకు పనిచేశారు. డ్యాన్స్ విషయంలో ఎక్కడా తగ్గని ఎన్టీఆర్ కి మ్యూజిక్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా మంచి మ్యూజికల్ హిట్స్ అందించాడు దేవి శ్రీ ప్రసాద్. నా అల్లుడు, రాఖీ, అదుర్స్ లాంటి సినిమాల్లో సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి.

దేవి శ్రీ ప్రసాద్ పవన్ కళ్యాణ్

జల్సా సినిమాతో ఈ ఇద్దరి కాంబినేషన్ తెలుగు రాష్ట్రాల యువతని ఊపేసింది. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ పాటలు వినిపిస్తూనే ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలకి కూడా మంచి క్రేజ్ లభించాయి.

రమణ గోగుల పవన్ కళ్యాణ్

కెరియర్ మొదట్లో పవన్ కళ్యాణ్ కి రమణ గోగుల ఇచ్చిన హిట్స్ మామూలువి కాదు. ఇద్దరూ కలిసి చేసింది నాలుగు సినిమాలే అయినా ఆ నాలుగు సినిమాల్లో దాదాపు అన్ని మ్యూజికల్ హిట్స్ గా నిలవడం ఆసక్తికరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: