బర్త్ డే స్పెషల్: ఊహల పల్లకిలో ఊరేగించే గాయని 'ఉష'

Suma Kallamadi
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది గొప్ప గాయనీ గాయకులు ఉన్నారు. వారు పాడిన పాటలు ఎప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. పాట వచ్చి ఎన్నేళ్లైనా ఆ పాట ఎక్కడో ఓ చోట వినిపిస్తూ ఉంటుంది. తెలుగు పాటల శ్రోతలకు ఎన్నో మంచి పాటలను తన గొంతు ద్వారా వినిపించిన గానకోకిలల్లో ఒకరు "ఉష". ఈ రోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఉష 1980 వ సంవత్సరం మే 29 న నాగార్జున సాగర్ లో జన్మించారు. గాయనిగా తన జర్నీని "పాడుతా తీయగా" అనే టీవీ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. ఆ ప్రోగ్రాం లెజెండరీ సింగర్ దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగేది. ఆ ప్రోగ్రాం లో ఉష విజేతగా నిలిచారు. ఆ తర్వాత పలు టీవీ కార్యక్రమాల్లో పాటల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. ఉష 1996 నుండి 2000 వరకు అనేక సంగీత ప్రాధాన్యం గల టీవీ షోలలో పాల్గొన్నారు. పలు హిందీ టెలివిజన్ కార్యక్రమాలలో కూడా పాల్గొని మంచి పేరు సంపాదించుకున్నారు.


ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్ వద్ద ఉషకు గాయనిగా మొదటి అవకాశం వచ్చింది. ఆమె ఇల్లాలు సినిమాలో తొలి పాట పాడారు. ఉష 2000 సంవత్సరం నుండి టాలీవుడ్ లో గాయనిగా కొనసాగుతున్నారు. ఇంద్ర, చిరుత, అతిధి, పౌరుడు, వర్షం, భద్ర, చిత్రం, నువ్వు నేనూ, మనసంతా నువ్వే, నువ్వులేక నేను లేను, జయం, సంతోషం, నీ స్నేహం, అవునన్నా కాదన్నా వంటి పలు హిట్ సినిమాల్లో ఆమె పాటలు పాడారు. ఆమె తన మధురమైన పాటలకు ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. ఉష 2002 సంవత్సరంలో నీ స్నేహం సినిమాలోని "చినుకు తడికి" పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డు గెలుచుకున్నారు. 2001 లో పద్మ అనే సినిమాలోని 'కల్లు తెరవని' పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డు గెలుచుకున్నారు.

 

ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను, హే.. లంగా వోణీ నేటితో రైద్దెపోని, మౌనంగానే ఎదగమని, చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, తూనీగ తూనీగ, రివ్వున ఎగిరే గువ్వా లాంటి ఎన్నో హిట్ పాటలను ఆమె పాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: