ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమా హిట్ కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా...?

P.Nishanth Kumar
జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన  నటించిన ఊసరవెల్లి సినిమా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించగా 2011 అక్టోబర్ 6న రిలీజ్ అయ్యి ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.. సురేందర్ రెడ్డి కిక్ సినిమా తర్వాత తెరకెక్కించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండగా ఈ సినిమా కూడా ఆ సినిమా తరహాలోనే సూపర్ హిట్ అవుతుంది అని అనుకున్నారు.. దానికి తగ్గట్లే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం యూత్ ని ఉర్రూతలూగించింది.. ట్రైలర్కి మంచి స్పందన రాగా పాటలకి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు..

కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత యావరేజ్ గా నిలవడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ డల్ అయ్యారు.. అప్పటికే శక్తి సినిమా తో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో అయినా హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలి అనుకున్నాడు కానీ ఆ సినిమా కూడా పోవడంతో మరింత నిరాశలో కూరుకుపోయాడు ఎన్టీఆర్.. 27న్నర కోట్ల షేర్ కలెక్ట్ చేసి బిలో యావరేజ్ మూవీ అయింది ఊసరవెల్లి.. 25 కోట్లతో తీసిన ఈ సినిమా 10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో 35 కోట్లకు అమ్ముడు అయ్యింది.. అందులో 80 శాతం మాత్రమే రాబట్టింది..

తారక్ నటన , తమన్నా గ్లామర్, జయ ప్రకాష్ రెడ్డి కామెడీ, దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ ఉంటే రిపీట్ ఆడియన్స్ రావాలి కానీ ఒకసారి చూడడమే గగనం అయిపోయింది అన్నారు ప్రేక్షకులు.. నిజానికి ఊసరవెల్లి అనే టైటిల్ పెట్టడం ఎలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చలేదు.. అందులోనూ ఈ సినిమా లో వచ్చే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లో చాలాసేపు హీరో కనబడకపోవడం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు.. ఈ సినిమా కి నెగెటివ్ టాక్ రావడానికి కారణం హీరో కి ఎలాంటి ఆశయం లేకుండా, హీరోయిన్ ఆశయమే లక్ష్యంగా కథనం ఉండడమే కారణమని పరుచూరి బ్రదర్స్ చెప్పారు.. అందుకే క్లైమాక్స్ లో ఏదో కోల్పోయామనే భావన ఫ్యాన్స్ లో ఏర్పడింది అని  ఆయన వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: