'సర్కారు వారి పాట' కు.... అది పెద్ద ప్లస్ అయ్యే ఛాన్స్ ..... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్, అందాల నటి కీర్తి సురేష్ ల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఫైనాన్షియర్ పాత్ర చేస్తుండగా ఆయన తండ్రి క్యారెక్టర్ ని సీనియర్ యాక్టర్ జయరాం చేస్తున్నారని అంటున్నారు. మహేష్ బాబు ఈ సినిమాలోని తన పాత్ర కోసం పూర్తిగా తన మేకోవర్ ని చేంజ్ చేయడంతో పాటు ముఖ్యంగా లాంగ్ హెయిర్ ని పెంచిన విషయం తెలిసిందే. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫి అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు దీనిని ఎంతో భారీగా నిర్మిస్తున్నాయి.
ఇటీవల దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ని కొన్నాళ్లక్రితం హైదరాబాద్ లో మొదలెట్టినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సడన్ గా యూనిట్ లోని కొందరికి కరోనా సోకడంతో షూట్ ని అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇటీవల మన దేశ బ్యాంకులను కుదిపేసిన పలు ఆర్ధిక నేరాల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోందని సమాచారం. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ పలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమా కి రన్ టైం చాలా తక్కువ అని, మొత్తంగా సినిమా కేవలం 2 గంటల 20 నిముషాలు మాత్రమే ఉంటుందని, ఒకరకంగా ఇది సర్కారు వారి పాట కు కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. మరి తొలిసారిగా మహేష్ తో పరశురామ్ తీస్తున్న ఈ సినిమా స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని నెలల వరకు వెయిట్ చేయాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: