ఉదయ్ కిరణ్ భారీ సినిమా వారి వల్లే ఆగిపోయింది: ప్రముఖ దర్శకుడు

Mamatha Reddy
ఉదయ్ కిరణ్.. క్షణికావేశంలో సూసైడ్ చేసుకుని బంగారు లాంటి జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడు.. హీరోగా అంతబాగా లేని సమయంలో అయన ఈ పని చేసి అయన అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.. ఫెయిల్యూర్ అయ్యానని బాధ, లైఫ్ లో ఎదగలేకపోయాననే డిప్రెషన్ అయన లో గత కొన్నాళ్ల నుంచి ఉందనేది అందరికి తెలిసిన సత్యం.. దీనికి తోడు పర్సనల్ లైఫ్ కూడా బాగా లేకపోవంతో ఆయన సూసైడ్ చేసుకున్నారని వార్తలు అప్పట్లో వినిపించాయి. ఉదయ్ కిరణ్ ఎంత మంచి నటుడో అందరికి తెలిసిందే..
చిత్రం సినిమా తో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ కి పరిచయమై నువ్వు నేను తో స్టార్ హీరో గా సెటిల్ అయ్యాడు.. ఆ తర్వాత వరుసమంచి హిట్ లతో దూసుకెళ్లాడు.. తన నటనతో పెద్ద పెద్ద హీరోలతో చెమటలు పట్టించాడు. అయితే తనకు వచ్చిన సక్సెస్ ని కొనసాగించలేకపోయాడు ఉదయ్ కిరణ్.. దాంతో కెరీర్ పరంగా ఫెయిల్ అయ్యాడు.. ఆ తర్వాత లైఫ్ లో కూడా సంసారం జీవితం ఆయనకు సరిగ్గా నిలవలేకపోయింది.. దాంతో అయన సూసైడ్ చేసుకున్నాడు..
అయితే మధ్యమధ్యలో ఉదయ్ కిరణ్ చేయాల్సిన కొన్ని పెద్ద సినిమాలు సడన్ గా ఆగిపోవడం వెనుక ఒక హస్త ఉండేదని రూమర్స్ చాలానే వచ్చాయి. కానీ అందులో నిజం లేదని కొంతమంది దర్శకులు వివరణ ఇచ్చారు. సెంట్ గా సీనియర్ డైరెక్టర్ వీరభద్రం కూడా ఒక వివరణ ఇచ్చాడు. ఆహా నా పెళ్ళంటా, పూల రంగడు, భాయ్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వీరభద్రం 2005లో ఉదయ్ కిరణ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కథ సెట్టయ్యింది. మంచి ప్రొడ్యూసర్ కూడా సెట్టయ్యడాని అనుకున్న సమయానికి ఆ సినిమా సడన్ గా క్యాన్సిల్ అయినట్లు చెప్పారు.అది చాలా పెద్ద ప్రొడక్షన్ అని ఉదయ్ కిరణ్ నా సినిమాను క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని ఉదయ్, అయినప్పటికి అతను చాలా మంచి వ్యక్తి అని వీరభద్రం వివరణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: