విశాఖలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వెనుక ఆంతర్యం ?

Seetha Sailaja
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా మారడం ఎదో ఒకరోజు ఖాయం. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ కూడ నెమ్మదిగా హైదరాబాద్ నుండి విశాఖపట్నంకు షిఫ్ట్ అయ్యేకాలం దగ్గరలో ఉందా అన్నచర్చలు మళ్ళీ ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి విశాఖపట్నంకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ షిఫ్ట్ చేసే ఆలోచనలు ఇప్పటివి కావు కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి.

గతంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు చాలముందు చూపుతో విశాఖలో ఒక స్టూడియో  నిర్మించారు. చిరంజీవికి కూడ అక్కడ స్టూడియో నిర్మించే ఆలోచనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ ఈ చర్చలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ప్రారంభం కావడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ కొందరు విశ్లేషకులు అనేక అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు.

ఈ నేపధ్యంలో విశాఖలో ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ కి ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు కేటాయించడమే కాకుండా అనుమతులు కూడా  మంజూరు చేసింది అన్న వర్తలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఆ నిర్మాణ పనులు మొదలవుతాయని అన్న వార్తలు వస్తున్నాయి. ఈ కల్చరల్ సెంటర్ కనుక వస్తే విశాఖకు తెలుగు సినిమాతో కనెక్టివిటీ ఇంకా బాగా పెరుగుతుంది అంటున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్టూడియోను సొంతంగా నిర్మిస్తుంది అన్నవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.  

ఇలాంటి పరిస్థితులలో ఈ కరోనా పరిస్థితులు చక్కపడ్డాక తిరిగి విశాఖపట్నం వైపు అడుగులు వేసే పరిస్థితి ఏర్పడవచ్చు అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. దీనికితోడు విశాఖపట్నంలో లోకల్ టాలెంట్ బాగా అందుబాటులో ఉంటుంది. దీనితో హీరోలు హీరోయిన్స్ కాకుండా చిన్నచిన్న పాత్రలు చేసే నటీనటులు విశాఖపట్నంలో ఎక్కువగా దొరుకుతారు కాబట్టి నిర్మాతలకు ఖర్చులు కూడ బాగా తగ్గే ఆస్కారం ఉంది. ఇప్పటికే మన తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ కు మారింది. ఇప్పుడు విశాఖపట్నం బాటపడితే ఇండస్ట్రీ మరోసారి భారీ మార్పులు దిశగా అడుగులు వేస్తోంది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: