అన్నా చెల్లెళ్లుగా నటించి, ప్రేమ పెళ్లి చేసుకున్న జంటిదే ?

VAMSI
సినీ ఇండస్ట్రీ... ఇదో రంగుల ప్రపంచం. ఈ నటనా రంగంలో కెమెరా ముందే కాదు కెమెరా వెనుక కూడా ఇన్నో వింతలు, అద్భుతాలు జరుగుతుంటాయి. నటీనటులు తమ పాత్రలు పండించడానికి తమ ప్రాణం పెట్టి నటిస్తుంటారు. స్క్రీన్ పై భార్య భర్తలుగా నటించగా వారు ఆఫ్టర్ కెమెరా బాయ్ సిస్టర్ బాయ్ బ్రదర్ అని చెప్పుకునే సందర్భాలు ఉంటాయి. వెండి తెరపై పొట్టి దుస్తుల్లో కనిపించే కొందరు కధానాయికలు, నిజజీవితంలో ఎంతో సంప్రదాయబద్ధంగా సాధారణ జీవితం గడుపుతుంటారు. అలాగే ఓ సినిమాలో అన్నా చెల్లిగా కనిపించిన నటులు, మరో సినిమాలో హీరోహీరోయిన్లుగా అలరిస్తుంటారు. సినిమా అనేది వారి ఫ్యాషన్ ...వారికొచ్చిన పాత్రలను పండించడం కోసం ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తారు. ఆ తర్వాత వారి నిజ జీవితంలో వారికి నచ్చిన విధంగా ఉంటారు.
అయితే  మొదట ఓ సినిమాలో నటించిన ఇద్దరు వ్యక్తులు ...ఆ తర్వాత వచ్చిన  సినిమాల్లో ప్రేమ  జంటగా కూడా నటించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అలా కలసి కొంత కాలం సినీ ప్రయాణం చేసిన ఆ జంట ప్రేమ వివాహం చేసుకోవడం. మళయాళ నటుడు జయరాం సుబ్రహమణ్యం ..తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. అల వైకుఠ పురములో చిత్రంలో అల్లు అర్జున్ ఒరిజినల్ తండ్రిగా నటించిన విషయం తెలిసిందే. తమిళంలో కూడా ఎన్నో సినిమాలలో ఈయన నటించారు. కమలహాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పంచతంత్రం సినిమాలో అయిదుగురు స్నేహితుల్లో జయరాం కూడా ఒక స్నేహితుడిగా నటించారు. ఆ సినిమా అప్పట్లో ఎంతో గుర్తింపు పొందింది. ఇలా తెలుగు, తమిళ్, మలయాళం కలిపి సుమారు 200 చిత్రాల్లో నటించారు జయరాం.
ఇక ఈయన భార్య కూడా ఒకప్పటి హీరోయిన్. ఆమె మరెవరో కాదు పార్వతి. జయరాం కంటే ముందు సినీరంగ ప్రవేశం చేసిన ఈమె జయరాం మొదటి చిత్రం అపారం మూవీలో ఆయనకి చెల్లెలుగా నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా కూడా చేశారు. అలా వీరి సినీ జర్నీలో కలిసిన వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు కాళిదాస్ జయరాం, ప్రస్తుతం సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. కుమార్తె మాళవిక జయరాం ఈమె మోడల్ గా కెరియర్ ని ఆరభించింది. ఓ సినిమాకు ఈమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా తన మొదటి సినిమాలో పార్వతికి అన్నగా నటించిన జయరాం...నిజ జీవితంలో పార్వతిని పెళ్ళాడి సంతోషంగా వారి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: