సినిమాలో చాన్సు కోసం ఈ యాంకర్ ఏంటి ఇలా చేసింది...?

VAMSI
బుల్లి తెరలో మంచి ఫామ్ లో దోసుకు వెళ్తున్న వారిలో అనసూయ, శ్రీముఖి, రష్మీ ముందు వరుసలో ఉంటారు. ఆ తరువాత ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ప్రముఖ వ్యాఖ్యాత వర్షిణి. బుల్లి తెరపై యాంకర్లు గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మలు ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ ను బాగా పెంచారు. లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ లతో యువకుల మతి పోగొడుతున్నారు. అయితే ఇప్పుడు అదే తరహాలో తన హాట్ ఫోటోలతో యువతను ఆకర్షిస్తోంది వర్షిణి. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్షిణి.. తన ముద్దు ముద్దు మాటలతో.. అందమైన నవ్వుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా దూసుకుపోతోంది.
ప్రస్తుతం ఈ అమ్మాయికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్ర‌స్తుతం మా టీవిలో ఆదివారం ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్‌కి వ్యాఖ్యాతగా చేస్తోంది. ఇందులో త‌న యాంక‌రింగ్‌తో అలరిస్తోంది వ‌ర్షిణి. అయితే కెరీర్ ప్రారంభంలో ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఆమెకు త‌గినంత గుర్తింపు రాలేదు. అయిన‌ప్ప‌టికీ నిరాశ చెంద‌కుండా బుల్లితెరపై తన సత్తా చాటుతూ పలు షోలతో అలరిస్తున్న ఈ భామకు మళ్లీ వెండితెరపై కనిపించాలని ఆకాంక్ష పెరిగిందో ఏమో కానీ... తన హాట్ ఫోటో షూట్ ల డోస్ ను అమాంతం పెంచేసింది.
తాజాగా ఈ బ్యూటీ నల్ల చీర ఓపెన్ బ్యాక్ బ్లౌజ్ ధరించి తన మేనిఛాయ అందాల్ని ప్రజెంట్ చేసింది. దాంతో త‌న అందంతో ఆక‌ట్టుకునే ఈ బ్యూటీ ఫోటోలు మరోసారి సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి. రోజు రోజుకీ తన అందంలో మరింత కొత్తదనాన్ని చూపుతూ కుర్ర కారులో జోరు పెంచేస్తోంది అంటూ, ఆకాంక్ష తనలో నిండుగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే ఇకనైనా ఈ భామకు ఆ వైపుగా హీరోయిన్ అయ్యే అవకాశాలు వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: