స్వచ్చంద థియేటర్స్ బంద్ దిశగా అడుగులు ?

Seetha Sailaja

ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విషయంలో తమ వ్యూహాలు మార్చి ప్రజలే స్వచ్చందంగా జాగ్రత్తలు తీసుకుంటూ పెరిగిపోతున్న కరోనా కేసుల బారి నుండి తప్పించుకోవాలాని సూచనలు ఇస్తున్నాయి. దీనితో బార్ లు పబ్ లు ధియేటర్ల విషయంలో ప్రభుత్వ ఆంక్షలు ఉండవని ప్రజలే నిర్ణయించుకుని వాటి గడప తోక్కాలో లేదో నిశ్చయించుకోమని ప్రభుత్వాలు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాయి.

ఇప్పటికే కొన్ని గ్రామాలతో పాటు కొన్ని హోల్ సెల్ వ్యాపారులు తమకు తామే స్వచ్చంద లాక్ డౌన్ విధించుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాలలోని ధియేటర్లకు కూడ రాబోతోందా అన్న సంకేతాలు వస్తున్నాయి. గతవారం విడుదలైన ‘వకీల్ సాబ్’ కోసం తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఊళ్లలోనూ మిగతా సినిమాలు తీసేసి అన్నింటిలోను ‘వకీల్ సాబ్’ ప్రదర్శించేలా వ్యూహాలు రచించారు.

ఉగాది పండుగ తరువాత ‘వకీల్ సాబ్’ కలక్షన్స్ పూర్తిగా పడిపోతాయి అని అంటున్నారు. అతరువాత జనం చూడటానికి మరొక సినిమా కూడ అందుబాటులోకి రావడంలేదు. ఈవారం విడుదల కావలసిన ‘లవ్ స్టోరీ’ ఇప్పటికే వాయిదా పడింది. ‘టక్ జగదీష్’ మూవీ కూడ ఇదే బాట పట్టబోతోంది. దీనితో ధియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉండదు. దీనికితోడు ఉగాది తరువాత చాల ధియేటర్లలో ‘వకీల్ సాబ్’ ను తీసి వేస్తారు. ఈవారం కేవలం రామ్ గోపాల్ వర్మ ‘దెయ్యం’ మూవీతో పాటు మరో మూడు చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో భారీ సినిమాలు మళ్ళీ ఎప్పుడు విడుదల అవుతాయో ఎటువంటి క్లారిటీ లేదు. దీనితో నష్టాలను భరిస్తూ కరెంటు ఖర్చులకు కూడ రాని చిన్న సినిమాలను ప్రదర్శించేకంటే పరిస్థితులు చక్కపడే వరకు ధియేటర్లను తమకు తామే స్వచ్చందంగా మూసివేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో రెండు రాష్ట్రాలలోని కొందరు ధియేటర్ల యజమానులు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈవార్తలే నిజం అయితే ధియేటర్లు మూత పడటంతో మళ్ళీ సినిమా నిర్మాతలకు కష్టాలు మొదలైనట్లే అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: