జబర్దస్త్ కు రష్మి గుడ్ బై.. మ్యాటరెంటంటే?

Satvika
బుల్లి తెర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒక కామెడీ షో ఏడేళ్లుగా టాప్ రేటింగ్ తో సత్తాను చాటుతుంది. షో పై ఎన్ని కాంట్రవర్సీ లు వచ్చినా.. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసిన ఎక్కడా తగ్గకుండా దూసుకు పోతుంది. ఆ షో నే జబర్దస్త్..ఈ కామెడీ షో విజయం సాధించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఒక ప్రధాన కారణం. ఈమె కోసమే కామెడీ షో చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదిరిపోయే హాట్ షో చేస్తూ మతులు చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. జబర్దస్త్ మొదట్లో అనసూయ యాంకర్ గా ఉండేది. అయితే ఆమె కొన్ని వ్యక్తిగత కారణాల తో తప్పుకోవడంతో రష్మి వచ్చింది.

వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ హాట్ ఎక్స్పోజ్ తో సెన్సేషనల్ హాట్ షో చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ.. ఏడేళ్లు పూర్తి కావస్తున్నా కూడా ఈ అమ్మడు ఈ షో ను వదల్లేదు.. ఒకవైపు సినిమాలను చేస్తూనే , మరో వైపు షో లో కొనసాగుతుంది.జబర్దస్త్ కామెడీ షో తనకు లైఫ్ ఇచ్చింది అనే ఒకే ఒక్క కారణంతో ఇక్కడే ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఈమె కూడా మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

జబర్దస్త్ కు వచ్చిన ఐదేళ్ళలో కేవలం మూడు సార్లు మాత్రమే ఈమెకు పారితోషికం పెంచారని..బయట మంచి అవకాశాలు వస్తుండడంతో అక్కడికి వెళ్లిపోవాలి అని రష్మీ భావిస్తున్నట్లు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది..మల్లెమాల దగ్గర చర్చించి పారితోషికం పెంచితే ఇక్కడే ఉండాలా..?లేదా ? అనే నిర్ణయం రష్మి గౌతమ్ తీసుకుంటుంది. లేదంటే మాత్రం ఈమె జబర్దస్త్ కు దూరంగా వెళ్ళడం దాదాపు ఖాయం అయిపోయింది. ఇప్పటికే జెమిని, మా టీవీల్లో ఈమె రెండు కార్యక్రమాలకు యాంకర్ గా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. అందుకే జబర్దస్త్ షో కు గుడ్ బై చెప్పాలని భావిస్తుంది.. అయితే రష్మి ఈ షో ను వదిలేస్తే రెండిట్లో అనసూయ హవాను కొనసాగిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: