టాలీవుడ్ లో 9 భాషల్లో రీమేక్ అయినా తెలుగు తొలి చిత్రం ఏదో మీకు తెలుసా....?

sangeetha
 సాధారణంగా ఒక భాషలో ఒక సినిమా విజయం సాధించిందంటే ఆ సినిమాను వివిధ భాషలలో తెరకెక్కించడం కొత్తేమి కాదు.ఆ విధంగా పలు భాషలలో మంచి విజయం సాధించిన సినిమాలు తెలుగులో రీమేక్ అయి ఘన విజయం సాధించినవి కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఇతర భాషలలో విజయం సాధించిన సినిమాలు తెలుగులో రీమేక్ చేసేవారు. ప్రస్తుతం తెలుగు సినిమాలను కూడా ఇతర భాషల్లో రీమేక్ చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. సాధారణంగా ఒక సినిమా 2,3 భాషలలో రీమేక్ చేస్తే గొప్ప విషయంగా చెబుతుంటారు. అదే సినిమా అంతకన్నా ఎక్కువ భాషలలో రీమేక్ చేస్తే అది ఒక రికార్డు అని చెప్పవచ్చు

 రీమేక్.. ఒక భాషలో ఒక సినిమా హిట్ అయ్యింది అంటే చాలు ఇతర భాషల సినీ దర్శక నిర్మాతలు రీమేక్ రైట్స్ తీసేసుకొని చిత్రీకరిస్తుంటారు. ఇటీవల కాలంలో అయితే రీమేక్ అనేది ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లో పింక్ సినిమా ఇక్కడ వకీల్ సాబ్ గా తెరకెక్కుతుంటే.. ఇక్కడ అర్జున్ రెడ్డి, జెర్సీ వంటి చిత్రాలు బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తెరకెక్కి సూపర్ హిట్ అవుతున్నాయ్.

అయితే ఇప్పుడు ఇలా రావడం సాధారణమైన విషయమే అయినప్పటికీ 2005లో టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టిన సిద్దార్ద్, త్రిష సినిమా నువ్వేస్తానంటే నేనొద్దంటానా ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయ్యింది. అది కూడా 7 స్వదేశీ భాషలు, రెండు విదేశీ భాషల్లో రీమేక్ అయ్యింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే రీమేక్ అయిన ప్రతిచోటా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది

మరో విశేషం ఏమిటంటే.. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా కాజోల్‌ హీరోయిన్ గా తెరకెక్కిన ‘ప్యార్ కియా తో డర్నా కా’ సినిమాను రీమేక్ గా కొన్ని మార్పులు చేర్పులు చేసి నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే పేరుతో ప్రభుదేవా తెరకెక్కించాడు. అదే సినిమాను మళ్లీ హిందీలో రామయ వస్తావయ అనే పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు బాలీవుడ్ వాళ్ళు. ఇప్పుడు ఏ ఏ భాషల్లో ఏ పేర్లతో ఈ సినిమా రిలీజ్ అయ్యిందో తెలుసుకుందాం.

తమిళంలో ‘ఉనక్కం ఎనక్కం’పేరుతో రీమేక్ అయింది. కన్నడలో  ‘నీనెల్లో నానల్లే’ పేరుతో రీమేక్ చేశారు.
బెంగాలీలో 'ఐ లవ్ యు' పేరుతో రీమేక్ చేశారు.
మణిపురిలో ఈ చిత్రాన్ని 'నింగోల్‌ తజబ' పేరుతో రీమేక్ చేశారు.ఒడియాలో  ‘సునా ఛాదీ మో రూపా ఛాదీ’ పేరుతో రీమేక్ చేసారు.పంజాబీలో  ‘తేరా మేరా కీ రిష్తా’ పేరుతో రీమేక్ చేశారు.హిందీలో ఈ చిత్రాన్ని ‘రామయ వస్తావయ’ పేరుతో రీమేక్ చేశారు. బంగ్లాదేశ్ లో  'నిస్సా అమర్‌ తుమీ' పేరుతో రీమేక్ చేశారు.నేపాలిలో ఈ సినిమాను  ‘ది ఫ్లాష్ బ్లాక్: ఫర్కెరా హెర్దా’ పేరుతో రీమేక్ చేశారు.తొమ్మిది భాషల్లో రీమేక్ అయిన ఈ చిత్రం అన్ని భాషలలో కూడా ఘన విజయం సాధించడం మరొక రికార్డ్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: