నాగబాబుకి ఇష్టమైన యాంకర్ అమెనట ..!?

Suma Kallamadi

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినాగానీ తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. హీరోగా పరిచయం అయినాగానీ ఎక్కువ  క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలో చేసాడు. ఆ తరువాత నిర్మాతగా కూడా అవతారం ఎత్తారు. ఒకప్పుడు చాలా సినిమాల్లో నటించాడు. తరువాత బుల్లితెరలో కొన్ని సీరియల్స్ లో కూడా నటించి అందరిని మెప్పించాడు. ఇక, జబర్ధస్త్ షో ద్వారా దాదాపు ఏడేళ్ల పాటు బుల్లితెరపై సందడి చేశారు.ఈ మధ్య కాలంలో సినిమాలకు, షోలకు దూరంగా ఉంటూ వచ్చాడు నాగబాబు.కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టీవ్ గానే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఒక లైవ్ చాట్‌లో జబర్ధస్త్ యాంకర్‌పై నాటీ కామెంట్స్ చేశారు నాగబాబు.మరి ఆ విశేషాలు ఏంటో చూద్దామా.. !

జబర్ధస్త్ షోలో చాలా కాలం పాటు జడ్జ్‌గా వ్యవహరిస్తూ అదిరిపోయే స్టార్‌డమ్‌ను అందుకున్నారు నాగబాబు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ షో నుంచి బయటకు వచ్చేశారు. అదే సమయంలో మరో ఛానెల్‌లో ‘అదిరింది' అనే షోను ప్రారంభించారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.  తాజాగా నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు.

వీటన్నింటికీ సమాధానాలు ఇచ్చిన నాగబాబు ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తన దైన శైలిలో జవాబు ఇచ్చాడు. ‘జబర్ధస్త్ యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌లో ఎవరు మీ ఫేవరెట్' అని నాగబాబుని ఒక నెటిజన్ ప్రశ్న అడగగా నాగబాబు  టక్కున జవాబిచ్చారు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు వెంటనే జవాబిస్తూ.. ‘ఎప్పటికీ అనసూయనే హాట్' అంటూ ఒక నాటీ కామెంట్ చేశారు నాగబాబు. దీంతో రష్మీ గౌతమ్‌కు భారీ షాక్ తగిలింది అనే చెప్పాలి. మెగా బ్రదర్ చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అదే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: