జాతిరత్నాలు సినిమాని అమెజాన్ ప్రైమ్ ఎంతకీ కొన్నారో తెలుసా ??

NIKHIL VINAY
మార్చి నెల అంత జాతిరత్నాలు సినిమా చేసిన రచ్చ అంత ఇంత కాదు. రెండు గంటలు ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోవచ్చు అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.   మహా శివరాత్రి కానుకగా ఈనెల 11న విడుదలైన ఈ సినిమాకి  ప్రోమోస్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో హైప్ క్రియేట్ అయ్యింది.ఈసినిమాను వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా దాదాపు ఏడు వందలకు పైగా థియేటర్లలో విడుదలై.. అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులతో అదరగొడుతోంది. మొదటి రోజు ‘జాతి రత్నాలు'కు భారీగానే కలెక్ట్ చేయడం విశేషం.ఓ చిన్న సినిమాగా విడుదలై ఇంత మొత్తంలో గ్రాస్ అండ్ షేర్ రావడం మామూలు విషయం కాదు. ఈ సినిమా పెట్టిన పెట్టుబడి కూడా ఎప్పుడో రాబట్టుకుంది. ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడమతో మూవీ టీం అంత చాలా ఆనందంగా ఉన్నారు.  ఇండియాలో కోవిడ్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఓవర్సీస్ లో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ దీనికే వచ్చాయి.అయితే వరసగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ కొట్టిన జాతి రత్నాలు సినిమా ఓవర్సీస్ లో 1 మిలియన్ కలెక్షన్స్ రావడం విశేషం.
ఇక ఈ సినిమా ఏప్రిల్ 10వ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. అయితే అమెజాన్ ఈ సినిమా దాదాపుగా 6 కోట్ల పెట్టి కొనుక్కుంది అంట. ఇంత చిన్న సినిమాకి ఇంత రేంజ్ లో కొనడం గొప్ప విషయం అని అందరూ అంటున్నారు . ఇక నవీన్ పొలిశెట్టి కి ఈ వరస హిట్స్ రావడంతో ఆయన రేంజ్ మెల్లగా పెరుగుతుంది. నవీన్ తర్వాత సినిమా ఏది ఎంచుకుంటాడో అని ఇండస్ట్రీ ఆసక్తి గా ఉంది. ఇప్పటికే జాతిరత్నాలు సినిమా 30 కోట్లకి పైగా కలెక్షన్స్ సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: