జాతిరత్నాలు అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడు వస్తుందో తెలుసా?
మొదటి రోజు ‘జాతి రత్నాలు'కు భారీగానే కలెక్ట్ చేయడం విశేషం.ఓ చిన్న సినిమాగా విడుదలై ఇంత మొత్తంలో గ్రాస్ అండ్ షేర్ రావడం మామూలు విషయం కాదు. ఈ సినిమా ఎప్పుడో పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టుకుంది . ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడమతో మూవీ టీం అంత చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సినిమా ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్స్ లో తమిళ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా విజయ్ మాస్టర్ సినిమాని 3 రోజాల్లో క్రాస్ చేయడం విశేషం.ఇండియాలో కోవిడ్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ దీనికే వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయింది.అయితే వరసగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ కొట్టిన జాతి రత్నాలు సినిమా ఓవర్సీస్ లో 1 మిలియన్ కి చాలా దగ్గరికి వచ్చింది అని టాక్
.అలాగే ఈ సినిమాని ఏప్రిల్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు అని అమెజాన్ ప్రకటించారు. ఇక నవీన్ పొలిశెట్టి కి ఈ వరస హిట్స్ రావడంతో ఆయన రేంజ్ మెల్లగా పెరుగుతుంది. నవీన్ తర్వాత సినిమా ఏది ఎంచుకుంటాడో అని ఇండస్ట్రీ ఆసక్తి గా ఉంది.