గుడ్ బాయ్ అంటున్న రష్మిక మందన్నా

Chaganti
కన్నడ నాట క్రేజీ హీరోయిన్‌గా మారి తెలుగునాట కూడా స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది రష్మిక. ఆమె నెమ్మదిగా బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది.  వికాస్ బహల్ తెరకెక్కిస్తున్న డెడ్లీ అనే సినిమా గురించి చాలా రోజుల నుండి ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ సినిమాకు రష్మిక మందన తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకు మొదట కత్రినా కైఫ్‌ను తీసుకోవాలని చిత్రయూనిట్ భావించినా కత్రినా చేయలేనని చెప్పడంటో వాళ్ళు కృతి సనన్‌ ను సంప్రదించారు. 

కానీ కృతిసనన్ కూడా బిజీగా ఉండడంతో.. రష్మిక మందన ఈ సినిమాలో నటించే అవకాశం దక్కింది. అమితాబ్ బచ్చన్‌ కూతురుగా ఆమె ఈ సినిమాలో నటిసొంది. అయితే ఈ సినిమా టైటిల్ ముందు నుండి దేడ్లీ అనే ప్రచారం జరిగినా ఇప్పుడు టైటిల్ మార్చారని అంటున్నారు. అమితాబ్ బచ్చన్ నటించనున్న ఈ సినిమాకి గుడ్ బాయ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని అంటున్నారు.  ఈ గుడ్ బాయ్ రెగ్యులర్ షూట్ మార్చి 29 నుంచి ప్రారంభమవుతుంది. 

ఈ మూవీ షూటింగ్ కోసం ముంబైలో ప్రత్యేక సెట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందన్న ఆయన కుమార్తె గా కనిపించనున్నారు. సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన మిషన్ మజ్ను తర్వాత బాలీవుడ్ లో రష్మిక మందన్నకి ఇది రెండవ ప్రాజెక్ట్.  గుడ్ బాయ్ సినిమా తండ్రి-కుమార్తె మధ్య కథ అని చెబుతున్నారు. ఈ చిత్రానికి రష్మికకు భారీగా రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. బాలీవుడ్‌లోకి కొత్తగా వచ్చినప్పటికీ, రష్మికకు ఐదు నుంచి ఆరు కోట్ల భారీ రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: