మహేష్ బాబు తో రొమాన్స్ చేయబోతున్న కృతి శెట్టి..?

Suma Kallamadi
ఉప్పెన సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని పాపులారిటీ సంపాదించిన మంగళూరు బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం తెలుగులో 3 సినిమాలు చేస్తున్నారు. నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. ప్యూర్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా పై బాగానే అంచనాలు నెలకొన్నాయి. ఐతే లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరొక సినిమాలోని ఫిమేల్ లీడ్ లో నటించడానికి కృతి శెట్టి ఒప్పుకున్నారు. ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్నారు.

ఒక్క సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయ్యారు అంటే అతిశయోక్తి కాదు. తన మొదటి సినిమాకి కేవలం రూ. 6 లక్షలు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రూ. 60 లక్షల వరకు పారితోషికం పుచ్చుకుంటున్నారని సమాచారం. తన అందచందాలతో మరిన్ని అవకాశాలు చేజిక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని కూడా చేజిక్కించుకున్నారు అని వార్తలు గుప్పుమంటున్నాయి. మహేష్ బాబు కోసం అనిల్ రావిపూడి ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు అనిల్ రావిపూడి కి ఫోన్ చేసి కృతి శెట్టి ని హీరోయిన్ గా తీసుకుందామని అడిగారట. అందుకు అనిల్ రావిపూడి కూడా అంగీకరించినట్టు సన్నిహిత వర్గాల సమాచారం.

అయితే ఇది అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ కాదని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం కృతి శెట్టి డేట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ఇప్పుడే ఆమెను ఫిక్స్ చేసుకోవడం మున్ముందు రోజుల్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కావచ్చేమో అని దర్శక నిర్మాతలు కూడా భావిస్తున్నారు. నిజానికి మహేష్ బాబు ఎక్కువగా కొత్త హీరోయిన్లతోనే సినిమాలు చేస్తారు. ఒక్కసారి నటించిన వారితో మళ్ళీ ఇంకొకసారి నటించడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపరు. కొత్త హీరోయిన్లు ఎవరు దొరకకపోతే ఆయన నటించిన వారితోనే మళ్లీ నటిస్తారు. కానీ ఇప్పుడు విపరీతమైన  పాపులారిటీ పొందుతున్న న్యూ హీరోయిన్ కృతి శెట్టి దొరకడంతో మహేష్ బాబు ఆ చాన్స్ నే వదులుకోవాలి అనుకోవడం లేదట. అయితే ఈ ప్రచారంలో నిజమెంతో అబద్ధమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: