జూనియర్ సుహాసిని ఎందుకు తన కెరియర్ ను నాశనం చేసుకుందో తెలుసా..!

Divya

సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు అడుగు పెట్టి,  తమ జీవితాలలో ఒక మలుపు తీసుకొస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా  నటీమణులు సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే మాత్రం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. నటనకు తగ్గట్టుగా అందం, ఆహార్యంతో పాటు ప్రేక్షకులను మెప్పించగలిగే సామర్థ్యం  వారిలో ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు హీరోయిన్లను ఆదరిస్తారు. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ లు కూడా ఏది పడితే ఆ పాత్రలను పోషించకుండా, తమకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చే పాత్రలలో మాత్రమే నటించడం ఉత్తమం..

అంతేకాకుండా వారికి వచ్చే సినీ అవకాశాలను ఒక ప్లాన్డ్ గా చేస్తూ, దూసుకుపోతే సినీ కెరియర్లో మంచి పొజిషన్   ఉంటుంది.  అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోదగిన హీరోయిన్ శ్రేయ శరణ్. ఈమె నాటి నుంచి నేటి వరకూ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా మెలుగుతోంది. ఒకప్పటి స్టార్ హీరోల నుంచి ఇప్పటి స్టార్ హీరోల వరకూ అందరి సరసన నటించడానికి సిద్ధమవుతోంది. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినీ ఇండస్ట్రీలోకి వస్తూనే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.

కానీ కొంతమంది హీరోయిన్లు ప్రేక్షకులను మెప్పించలేక పోతే, వారిపై సినీ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ముద్ర పడుతుంది.  ఇక తర్వాత దర్శకులు వారి వైపు చూడడం మానేస్తారు. అలాంటి దారిలోనే ఉన్నారు జూనియర్ సుహాసిని. జూనియర్ సుహాసిని మొదటి సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినప్పటికీ ఈమెను ప్రేక్షకులు ఆదరించినా, పెద్దగా సినీ ఇండస్ట్రీలో పెద్దగా క్లిక్ కాలేకపోయింది. మొదట జూనియర్ సుహాసిని , బాలాదిత్య హీరోగా పరిచయం అవుతూ, బి.జయ దర్శకత్వంలో వచ్చిన సినిమా "చంటిగాడు" ఈ సినిమా మంచి హిట్ ను సాధించినప్పటికీ  తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక తర్వాత తమిళ్, భోజ్ పురి సినిమాలు ఎక్కువగా నటించింది. అయితే కేవలం చిన్న హీరోల సరసన మాత్రమే నటించేందుకు అవకాశం వచ్చింది.

కానీ బాలకృష్ణ సరసన పాండురంగడు సినిమాలో హీరోయిన్ గా నటించినప్పటికీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేకపోయింది. దాంతో చిన్న హీరోల సరసన చేసేటప్పటికి అతి తక్కువ కాలంలోనే సుహాసిని సినిమా కెరీర్ ముగిసింది. ఇప్పుడు బుల్లి తెర పై వరుస సీరియల్స్ చేస్తూ బిజీ అయిపోయింది. కేవలం బుల్లితెర పై వస్తున్న సీరియల్స్ లో  నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: