44 ఏళ్ల వయసులో మతిపోగొట్టే అందంతో మల్లికా..!

shami
బాలీవుడ్ భామ మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు చేసిన హిందీ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందాయి. శృంగార భరిత సినిమాలు చేయడంలో తన మార్క్ చూపించే మల్లికా మర్డర్ సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత దశావతారం సినిమా కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. బాలీవుడ్ తో పాటుగా హాలీవుడ్, చైనీస్ మూవీస్ లో కూడా నటించింది మల్లికా షెరావత్.
ప్రస్తుతం వెబ్ సీరీస్ లతో తన సత్తా చాటుతున్న అమ్మడు లేటెస్ట్ గా తన హాట్ శారీ పిక్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. శారీలో మల్లికా షెరావత్ అదరగొడుతుందని చెప్పొచ్చు. 44 ఏళ్ల వయసులో మతి పోగొట్టే అందంతో మల్లికా దుమ్ముదులిపేస్తుంది. ప్రస్తుతం మల్లికా షెరావత్ షేర్ చేసిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దేసి గర్ల్ అంటూ మల్లికా తన సోషల్ మీడియా ఖాతాల్లో తన ఫాలోవర్స్ ను రెచ్చగొట్టేలా ఈ హాట్ పిక్స్ షేర్ చేసింది. కొన్నాళ్లు కెరియర్ లో వెనకపడ్డ అమ్మడు ఈ హాట్ పిక్స్ తో మళ్లీ తన మీద అందరి చూపు పడేలా చేసుకుంది.
సరైన ఛాన్స్ రావాలే కాని మళ్లీ అమ్మడు తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ఉత్సాహంగా ఉంది. చూస్తుంటే మల్లికా షెరావత్ తన హాట్ పిక్స్ తో దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తున్నట్టు ఉంది. హిస్స్ అనే హిందీ, ఇంగ్లీష్ సినిమాలో మల్లికా న్యూడ్ గా నటించి షాక్ ఇచ్చింది. మళ్లీ అలాంటి ఒక్క ప్రాజెక్ట్ వస్తే మాత్రం అమ్మడి దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు. తప్పకుండా మల్లికకు మళ్లీ తన ఫాం కొనసాగించే ఓ అరుదైన అవకాశం కావాలని చూస్తున్నట్టు ఉంది.               

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: