సిందూరం సినిమా గురించి నమ్మలేని నిజాలు ఇవే..!?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ కృష్ణవంశీకి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గులాబీ సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయనకు నక్సలిజం మీద తీయాలని అనుకున్నారు. అప్పటికే వచ్చిన విప్లవం మూవీస్ అన్నీ చూసి, వాటి ఛాయలు పడకుండా భిన్నంగా కథ రాశారు. వర్షం మూవీ డైరెక్టర్ శోభన్ ఈ కథలో పని చేయడమే కాకుండా కో డైరెక్టర్ గా చేశాడు. సిరివెన్నెల సీతారామస్త్రి అద్భుతమైన సలహాలు ఇవ్వడంతో పాటు, అద్భుతమైన 5సాంగ్స్ కూడా రాశారు. శోభన్ ,శక్తి, చైతన్య ప్రసాద్ డైలాగ్స్ రాశారు. హాయ్ రే హాయ్ సాంగ్ ని చంద్రబోస్ రాశారు.
కృష్ణవంశీ తానే నిర్మాతగా మారి, ఆంధ్రా టాకీస్ పేరిట తొలిసినిమాగా సింధూరం ప్రకటించాడు. 1988లో ఒకపూట అన్నం పెట్టాడన్న కృతజ్ఞతతో గులాబీ మూవీలో మంచి పాత్రను బ్రహ్మజీకి ఇచ్చాడు. సింధూరంలో హీరో క్యారెక్టర్ ఇచ్చేసాడు. నిన్నే పెళ్లాడతా మూవీకి అసిస్టెంట్ గా చేసిన రవితేజను సెకండ్ హీరోగా సెలక్ట్ చేశారు. సౌందర్య, మీనా లలో ఒకరిని హీరోయిన్ గా చేయాలనుకున్నా, చివరికి సంఘవిని సెలెక్ట్ చేసారు. భానుచందర్, శివాజీ రాజా, ఆహుతి ప్రసాద్ తదితర తారాగణం. మ్యూజిక్ డైరెక్టర్ గా శ్రీ. 1997ఏప్రియల్ లో షూటింగ్ స్టార్ట్. తూర్పు గోదావరిలో షూటింగ్ దాదాపు పూర్తి. ముఖ్యంగా రంపచోడవరం అడవుల్లో తీశారు.
కానీ.. 1997సెప్టెంబర్ 12న రిలీజైన ఈ మూవీ మొదట్లో ఇందిరా, రాజీవ్ హత్యలను చూపించారు. ఎమోషన్స్ తో కూడిన సీన్స్, పాటలు, అప్పటి సామాజిక పరిస్థితులు, అవినీతి, సిన్సియారిటీ ఇలా అన్ని కలగలిపి తీసిన ఈ మూవీ కాసుల వర్షం మాత్రం కురిపించలేదు. బ్రహ్మాజీ కెరీర్ లో సింధూరం బెస్ట్ మూవీ . అర్ధశతాబ్ధపు సాంగ్ రాసిన సిరివెన్నెలకు అందరూ ప్రశంసలు కురిపించారు. కృష్ణ వంశీని ఆర్ధికంగా చిక్కుల్లో పడేసిన ఈ మూవీ అంతఃపురం, ఖడ్గం లాంటి మూవీస్ తీయడానికి ఊతమిచ్చింది. ఎందుకంటే ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు రావడమే. అలాగే ఐదు నంది అవార్డులు తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: